Petrol And Diesel Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. శుక్రవారం రేట్ ఎలా ఉందంటే..

|

Mar 26, 2021 | 10:42 AM

Petrol And Diesel Price Today: రోజురోజుకీ పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు గత కొన్ని రోజులగా కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపించింది. ముఖ్యంగా గురువారం దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది...

Petrol And Diesel Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. శుక్రవారం రేట్ ఎలా ఉందంటే..
Petrol And Diesl
Follow us on

Petrol And Diesel Price Today: రోజురోజుకీ పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు గత కొన్ని రోజులగా కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపించింది. ముఖ్యంగా గురువారం దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కరోనా సెకండ్‌ వేవ్‌, ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం తగ్గడం కారణలు ఏమైనప్పటీ క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో తరుగుదల కనిపించింది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.78 (గురువారం రూ.90.99)గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.81.10 (గురువారం రూ.81.30) వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.19గా ఉండగా డీజిల్‌ రూ. 88.20గా ఉంది.
* కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరల్లో తరుగుదల కనిపించింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.82గా (గురువారం రూ. 94.04) ఉండగా.. డీజిల్‌ ధర రూ. 85.99 (గురువారం రూ.86.21) వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 86.10గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.39 (గురువారం రూ.94.61)గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.45 (గురువారం రూ.88.67) వద్ద కొనసాగుతోంది.
* తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన వరంగల్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.96 (గురువారం రూ.94.18)గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.05 (గురువారం రూ.88.27)గా నమోదైంది.
* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.90 (గురువారం రూ.97.24) కాగా.. డీజిల్‌ ధర రూ. 90.43 (గురువారం రూ.90.76)గా ఉంది.
* ఇక సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 95.77 (గురువారం రూ.95.95) గా ఉండగా.. డీజిల్‌ రూ. 89.33 (గురువారం రూ.89.51) వద్ద కొనసాగుతోంది.

మిగతా నగరాల్లో పెట్రోల్‌ ధరల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

https://tv9telugu.com/business/petrol-price-today.html

మిగతా నగరాల్లో డీజిల్ ధరల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

https://tv9telugu.com/business/diesel-price-today.html

Also Read: Gold And Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?