Petrol Diesel price today: పెట్రో మంట.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Fuel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు

Petrol Diesel price today: పెట్రో మంట.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Fuel price

Updated on: Jun 13, 2021 | 7:41 AM

Fuel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. తాజాగా మళ్లీ పెట్రోల్‌, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.96.12 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.98 కి చేరింది.
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.30, డీజిల్ రూ.94.39 కు పెరిగింది.
చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.43 ఉండగా.. డీజిల్‌ రూ.91.64 గా ఉంది.
కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.06 గా.. డీజిల్‌ ధర రూ.89.83 గా ఉంది.
బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.33 డీజిల్‌ రూ.92.21 గా ఉంది.

తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.90, లీటర్‌ డీజిల్‌ రూ.94.82 కు పెరిగింది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.60, డీజిల్ ధర 94.54 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.102.25 గా ఉండగా.. రూ. 96.58 గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.05 ఉండగా.. డీజీల్ ధర రూ.95.41 గా ఉంది.

Also Read:

Gold & Silver Rate 13-6-2021: పసిడి ప్రియులకు శుభవార్త ఈరోజు కొంతమేర దిగివచ్చిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర

PF Balance Check: ఇపిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి..