Petrol Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ (Fuel Rates) ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. రెండు వారాల్లో లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ. 10 పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గురు, శుక్రవారాల్లో మాత్రం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించలేదు. అయితే ఈ స్థిరత్వం ఎన్ని రోజులు ఉంటాయన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్‌కు 96 నుంచి 100 డాలర్ల మధ్య ఉంది. మరి శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.47 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 105.47 గా ఉంది.
* వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.44 కాగా, డీజిల్ రూ. 105.44 వద్ద కొనసాగుతోంది.
* ఆదిలాబాద్‌లో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 121.80 గా ఉండగా, డీజిల్ రూ. 107.63 వద్ద నమోదైంది.
* గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 121.28 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 106.89 గా ఉంది.
* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 120.83 గా ఉండగా, డీజిల్ రూ. 106.42 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు రూ. 105.45గా ఉంది. డీజిల్ ధర రూ. 96.71 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా రూ. 120.5, రూ. 104.75 వద్ద ఉన్నాయి.
* తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర రూ. 110.83గా ఉంటే.. డీజిల్ రేటు రూ. 100.92గా ఉంది.
* బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 111.01 కాగా, డీజిల్ రూ. 94.78 వద్ద స్థిరంగా ఉంది.
Also Read: AP Cabinet: గవర్నర్ దగ్గరకు మంత్రుల రాజీనామా లేఖలు.. నేడు ఆమోదించే అవకాశం..