Petrol Price Today: పెరగుతోన్న ఇంధన ధరలు (Fuel Rates) సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే పరస్థితి వచ్చింది. గడిచిన రెండు వారాలుగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కారణం ఏదైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గడిచిన రెండు వారాలుగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు గురువారం మాత్రం కాస్త బ్రేక్ పడినట్లు కనిపించింది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగాయి. అయితే ఏపీలోని గుంటూరులో మాత్రం పెట్రోల్ పెరిగింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 121.44కి చేరింది. మరి గురువారం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 96.67 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 120.51 కాగా, డీజిల్ రూ. 104.77 గా నమోదైంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 110.85 గా ఉండగా, డీజిల్ రూ. 100.94 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 111.09 , డీజిల్ రూ. 94.79 గా ఉంది.
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.49గా ఉండగా, డీజిల్ రూ. 105.49 వద్ద కొనసాగుతోంది.
* గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 121.44 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 107.04 గా నమోదైంది.
* విశాఖటపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 కాగా, డీజిల్ రూ. 105.65 వద్ద కొనసాగుతోంది.
IPL 2022: తుఫాన్ సృష్టించిన ప్యాట్ కమిన్స్.. 14 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు..
MIM Corporator: పోలీస్ పవర్ చూపిస్తామంటే ఇక్కడ నడవదు.. రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పొరేటర్!