Petrol Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ వచ్చే నెలలో మాత్రం..

|

Feb 21, 2022 | 9:51 AM

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండడం లేదు. ప్రతీ రోజూ ధరలను సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే సుమారు రెండు నెలలుగా మాత్రం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే...

Petrol Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ వచ్చే నెలలో మాత్రం..
Petrol And Diesel Price Today
Follow us on

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండడం లేదు. ప్రతీ రోజూ ధరలను సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే సుమారు రెండు నెలలుగా మాత్రం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే ధరలు మళ్లీ పెరగనున్నాయని  నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ముడి చమురు ధర 80 నుంచి 94 డాలర్లకు చేరింది. అయితే త్వరలోనే 100 డాలర్లకు చేరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వచ్చే నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌పై ఏకంగా రూ. 8 వరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి… ఇక సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం…

* దేశ రాజధాని న్యఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 95.41 గా ఉండగా, డీజిల్‌ రూ. 86.67 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్ రూ. 109.98 కాగా, డీజిల్‌ రూ. 94.14 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.40 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 91.43 గా నమోదైంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 100.58 గా ఉండగా, డీజిల్‌ రూ. 85.01 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 108.20 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 110.61 కాగా, డీజిల్ ధర రూ. 96.68 గా ఉంది.

* సాగర తీరం విశాఖపట్నంలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.40 కాగా, డీజిల్‌ రూ. 95.51 వద్ద కొనసాగుతోంది.

Also Read: Kajal aggarwal: ప్లీజ్‌.. నన్ను బ్రతకనివ్వండి.. బాడీషేమింగ్ ట్రోల్స్‌పై కాజల్ ఆవేదన.. వీడియో

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి..ప్రధాన నగరాల్లో నేటి ధరలు

UP Elections: నాలుగో విడత ప్రచారానికి నేటితో తెర.. ఇవాళ ముఖ్యనేతల సుడిగాలి పర్యటన.. వివరాలు ఇవే