Kajal aggarwal: ప్లీజ్.. నన్ను బ్రతకనివ్వండి.. బాడీషేమింగ్ ట్రోల్స్‌పై కాజల్ ఆవేదన.. వీడియో
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరాకృతిలో మార్పులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ప్రెగ్నెన్సీ సమయంలో ట్రోలింగ్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్‌ను కూడా నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారట.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరాకృతిలో మార్పులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ప్రెగ్నెన్సీ సమయంలో ట్రోలింగ్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్‌ను కూడా నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారట. తాజాగా తన శారీరాకృతిపై చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించింది కాజల్. తన ఇన్‌స్టా ఖాతాలో ఇదే విషయమై సుధీర్ఘ పోస్ట్ చేసింది కాజల్.”నా జీవితంలో.. నా శరీరంలో.. ఇంట్లో.. పని ప్రదేశంలో అనేక మార్పులు వచ్చాయి. వాటన్నింటినీ నేను ఎంజాయ్ చేస్తున్నా.. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్స్, మీమ్స్ వల్ల నాకు ఏలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే.. కానీ ముందు ఎలా మెదలాలో నేర్చుకోండి.. మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇతరులు కూడా ఎదుర్కొంటున్నారు. వారికి నేనొక విషయం చెప్పాలి. గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో సహా మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్ది పొట్ట కూడా పెరుగుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడతాయి. మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. అలాగే ఇలాంటి సమయంలో తొందరగా అలసిపోతాం. ఈ సమయంలో మూడ్ స్వింగ్స్ కూడా వస్తుంటాయి. సమయాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అలాగే కొన్ని పరిస్థితులను తట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తలు అవసరం. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ సాధారణంగా మారడానికి చాలా సమయం పట్టవచ్చు. లేదంటే మునపటి స్థితికి మన శరీరం రాకపోవచ్చు. అయిన ఎక్కువగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలోకి మరో పాపాయి రాబోతున్న క్షణాలను ఎంజాయ్ చేయండి. ఎక్కువగా ఒత్తిడి పెంచుకోకండి.. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి. ఇతరుల గురించి ఫీల్ కాకండి.. చిన్నారికి జన్మనివ్వడం అనేది ఒక పెద్ద వేడుక అని గుర్తుంచుకోండి ” అంటూ కాజల్ సుదీర్ఘ పోస్ట్ చేసింది. తన మాటలతో అందరి మనసులను మరో సారి గెలుచుకుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

