AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan: పర్సనల్ లోన్ Vs గోల్డ్ లోన్.. రెండింటిలో ఏది బెస్ట్.. ఇవి తెలుసుకోకపోతే..

ఈ డిజిటల్ యుగంలో లోన్స్ తీసుకోని వారు ఉండడం చాలా తక్కువ. ప్రతీ తక్కువ ఏదో ఒక సమయంలో లోన్ తీసుకుంటారు. లోన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. పర్సనల్ లోన్ - గోల్డ్ లోన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Loan: పర్సనల్ లోన్ Vs గోల్డ్ లోన్.. రెండింటిలో ఏది బెస్ట్.. ఇవి తెలుసుకోకపోతే..
Personal Vs Gold Loan
Krishna S
|

Updated on: Aug 16, 2025 | 11:00 AM

Share

ఏదైన అవసరం వచ్చిందంటే టక్కున గుర్తొచ్చేది లోన్. దేశంలో లోన్ తీసుకోని వారు చాలా తక్కువ. వ్యాపారస్థుల నుంచి మొదలు సాధారణ వ్యక్తుల దాకా ఏదో ఒక సందర్భంలో లోన్ తీసుకుంటారు. బ్యాంకులు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ వంటి వివిధ రకాల లోన్లను అందిస్తున్నాయి. ఇందులో పర్సనల్ లోన్ సిబిల్ స్కోర్ ఆధారంగా ఇస్తే ..సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా ఇచ్చేది గోల్డ్ లోన్. జీవితంలో అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు లేదా పర్సనల్ లోన్స్ లేదా గోల్డ్ లోన్స్ అవసరపడతాయి. ఈ రెండు రకాల లోన్స్ మధ్య ఉన్న తేడాలు ఏంటీ..? ఏ లోన్ తీసుకుంటే బెటర్ అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పర్సనల్ లోన్స్

పర్సనల్ లోన్ అనేది ఒక అన్‌సెక్యూర్డ్ లోన్. అంటే ఈ రుణం పొందడానికి మీరు మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం, గతంలో రుణాలను తిరిగి చెల్లించిన చరిత్ర ఆధారంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. ఈ రుణం ద్వారా పొందిన డబ్బును వైద్య ఖర్చుల నుండి ఇంటి మరమ్మత్తుల వరకు, వివాహాల నుండి వ్యాపారాల వరకు దేనికైనా ఉపయోగించుకోవచ్చు.

రుణ మొత్తం: మీ ప్రొఫైల్‌ను బట్టి రూ.50,000 నుండి రూ.50 లక్షల వరకు.

తిరిగి చెల్లింపు వ్యవధి: 1 నుండి 8 సంవత్సరాలు.

వడ్డీ రేటు: సాధారణంగా సంవత్సరానికి 10శాతం-24శాతం వరకు ఉంటుంది.

అర్హత: మంచి సిబిల్ స్కోరు, స్థిరమైన ఆదాయం.

ప్రయోజనాలు: ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. నిధుల వినియోగంలో స్వేచ్ఛ ఉంటుంది. దీర్ఘకాలికంగా చెల్లించవచ్చు.

ప్రతికూలతలు: మంచి క్రెడిట్ స్కోరు లేకపోతే అధిక వడ్డీ, అర్హత ప్రమాణాలు కఠినంగా ఉంటాయి.

గోల్డ్ లోన్స్ ..

బంగారు రుణం అనేది ఒక సెక్యూర్డ్ లోన్. దీనికి హామీగా మీరు మీ బంగారు ఆభరణాలు లేదా నాణేలను (18-22 క్యారెట్లు) తాకట్టు పెట్టాలి. బంగారం ఉంటుంది కాబట్టి, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మీ క్రెడిట్ చరిత్రపై ఎక్కువ నిబంధనలు పెట్టరు. తక్కువ సమయంలో అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

రుణ మొత్తం: బంగారం మార్కెట్ విలువలో 75శాతం వరకు.

తిరిగి చెల్లింపు వ్యవధి: సాధారణంగా 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు.

వడ్డీ రేటు: సంవత్సరానికి 8శాతం నుండి 29శాతం వరకు ఉంటుంది.

అర్హత: 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా అర్హులు.

ప్రయోజనాలు: తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ సమయంలో డబ్బు చేతికి వస్తుంది. క్రెడిట్ స్కోరు అంతగా ప్రభావితం చేయదు.

ప్రతికూలతలు: మీరు రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మీ బంగారం కోల్పోయే ప్రమాదం ఉంది, తిరిగి చెల్లింపు వ్యవధి తక్కువగా ఉంటుంది.

ఏది బెస్ట్..?

పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ వాటి స్వంత ప్రయోజనాలు, రిస్క్‌లతో ఉంటాయి. మీకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉండి.. క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుతో స్వల్పకాలిక రుణం కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..