AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: పతంజలి ఫుడ్స్ డబుల్ బొనాంజా.. 100 షేర్లకు 150 షేర్లు.. రూ. 2 డివిడెండ్.. మీరూ కొన్నారా.?

పతంజలి తొలి త్రైమాసికంలో మంచి లాభాలు అర్జించింది. అయితే పట్టణాలలో డిమాండ్ తగ్గడం గమనార్హం. పతంజలి ఫుడ్స్ 2025 ఆర్థిక ఏడాదికి ప్రకటించిన ఒక్కో షేరుకు రూ.2 తుది డివిడెండ్‌కు రికార్డు తేదీని కూడా నిర్ణయించింది. సమృద్ధి అర్బన్ లాయల్టీ ప్రోగ్రామ్ లాభాల వద్ధికి తోడ్పడింది.

Patanjali: పతంజలి ఫుడ్స్ డబుల్ బొనాంజా.. 100 షేర్లకు 150 షేర్లు.. రూ. 2 డివిడెండ్.. మీరూ కొన్నారా.?
Patanjali Foods Revenue Increased
Krishna S
|

Updated on: Aug 16, 2025 | 12:19 PM

Share

పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ జూన్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. కంపెనీ ఆదాయం, లాభాలు గణనీయంగా పెరిగాయి. అయితే పట్టణ మార్కెట్లలో డిమాండ్ తగ్గడంతో పాటు ప్రాంతీయ బ్రాండ్ల నుంచి పోటీ పెరగినట్లు కంపెనీ తెలిపింది. అయితే గ్రామీణ మార్కెట్లలో మాత్రం డిమాండ్ స్థిరంగా ఉందని చెప్పింది. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాల ద్వారా మొత్తం రూ. 8,899.70 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 7,177.17 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కంపెనీ స్థూల లాభం 23.81శాతం పెరిగి రూ. 1,259.19 కోట్లుగా నమోదైంది. పన్నుల తర్వాత నికర లాభం రూ. 180.39 కోట్లుగా ఉంది. ఇది మొత్తం ఆదాయంలో 2.02శాతం.

ఈ విభాగాల నుంచి ఆదాయం

కంపెనీ ఆదాయంలో ఎడిబుల్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించింది.

ఎడిబుల్ ఆయిల్ : రూ. 6,685.86 కోట్లు

ఆహారం – ఇతర FMCG విభాగం: రూ. 1,660.67 కోట్లు

గృహ – వ్యక్తిగత సంరక్షణ విభాగం: రూ. 639.02 కోట్లు

షాపింగ్ ట్రెండ్

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పట్టణ వినియోగదారులు తక్కువ ధర కలిగిన లేదా చిన్న ప్యాక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని.. అదే సమయంలో ప్రాంతీయ బ్రాండ్లకు ఆదరణ పెరుగుతోందని పతంజలి తెలిపింది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, పతంజలి చిన్న ప్యాక్‌లు, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆహార ఉత్పత్తులలో వృద్ధిని సాధించింది. “సమృద్ధి అర్బన్ లాయల్టీ ప్రోగ్రామ్” వంటి కార్యక్రమాలు కూడా కస్టమర్లను నిలబెట్టుకోవడంలో సహాయపడ్డాయి.

డివిడెండ్ – బోనస్ షేర్లు

జూన్ త్రైమాసిక ఫలితాలతో పాటు, పతంజలి ఫుడ్స్ 2025 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.2 తుది డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీగా సెప్టెంబర్ 3ను నిర్ణయించారు. ఈ తేదీ నాటికి షేర్లు కలిగిన వాటాదారులు డివిడెండ్ పొందేందుకు అర్హులు. ఇప్పటికే జూలై నెలలో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి ఒక షేరుకు రెండు కొత్త షేర్లను ఉచితంగా పొందుతారు. అయితే ఈ బోనస్ షేర్ల రికార్డు తేదీని ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..