Post Office: రోజుకు రూ.2తో రూ.15లక్షలు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పాలసీ..
పోస్టాఫీస్ స్కీమ్స్‌కు గిరాకీ ఎక్కువ. కట్టడం తక్కువ.. లాభం ఎక్కువ ఉండడమే దీనికి కారణం. ఇప్పటికే చాలా మంది పోస్టాఫీస్ స్కీమ్స్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో అద్భుతమైన స్కీమ్‌ను అందిస్తుంది పోస్టల్ శాఖ. అతితక్కువ ప్రీమియంతో ఈ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

పోసాఫీస్ స్కీమ్స్ అత్యంత చౌకగా, అద్భుతంగా ఉంటాయి. అందుకే ఈ మధ్య చాలా మంది ఈ స్కీమ్స్ వైపు మళ్లుతున్నారు. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ తెచ్చిన పోస్టాఫీస్.. ఇప్పడు చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం కలిగే బీమా పాలసీని తీసుకొచ్చింది. పెరుగుతున్న ప్రమాదాలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో సామాన్యులకు భరోసా కల్పించేందుకు పోస్టల్ శాఖ.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో కలిసి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు కేవలం రూ.1.50 చెల్లిస్తే రూ.10 లక్షల బీమా, రూ.2 చెల్లిస్తే రూ.15 లక్షల బీమా పొందవచ్చు. ప్రైవేట్ బీమా సంస్థల అధిక ప్రీమియంల కారణంగా సామాన్య ప్రజలు బీమా పాలసీల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ లోటును పూరించడానికి పోస్టల్ విభాగం ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణించడం లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోవడం వంటి ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఈ బీమా పాలసీలు ఆర్థిక భద్రత కల్పిస్తాయి.
బీమా పాలసీల వివరాలు..
ఈ బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు గలవారు ఎవరైనా తీసుకోవచ్చు. దీని కోసం ఆధార్ కార్డు, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్ తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలు కూడా అవసరం కావచ్చు. అయితే సాయుధ బలగాలకు ఈ పాలసీ వర్తించదు.
ప్రీమియం – కవరేజ్:
రూ.549 ప్రీమియం (ఏడాదికి): రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజ్.
రూ.749 ప్రీమియం (ఏడాదికి): రూ.15 లక్షల ప్రమాద బీమా కవరేజ్.
ఇతర ప్రయోజనాలు:
ప్రమాద మరణం: ప్రమాదం కారణంగా మరణిస్తే రూ.10 లక్షలు లేదా రూ.15 లక్షల పూర్తి బీమా లభిస్తుంది.
శాశ్వత వైకల్యం: ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం, అంగవైకల్యం లేదా పక్షవాతం వస్తే పూర్తి బీమా మొత్తం చెల్లిస్తారు.
వైద్య ఖర్చులు: ప్రమాదంలో ఆసుపత్రిలో చేరితే రూ.60,000 వరకు వైద్య ఖర్చులను చెల్లిస్తారు. ఓపీడీ ఖర్చుల కోసం రూ.30,000 వరకు, ఆసుపత్రి అవసరం లేకపోతే పదిసార్లు రూ.1,500 విలువైన కన్సల్టేషన్లు వర్తిస్తాయి.
విద్య – ఇతర ప్రయోజనాలు:
ఇద్దరు పిల్లల విద్యా ప్రయోజనాల కోసం గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు లభిస్తుంది.
ప్రమాదం వల్ల వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ.1 లక్ష వరకు కవరేజ్ ఉంటుంది.
ఎముకలు విరిగిన సందర్భంలో రూ.1 లక్ష వరకు ఖర్చులను భరిస్తారు.
మానసిక ఇబ్బందుల కోసం నాలుగు కన్సల్టేషన్లు ఉచితంగా లభిస్తాయి.
ప్రమాదంలో వ్యక్తి వేరేచోట మరణిస్తే కుటుంబ సభ్యులు వెళ్లిరావడానికి రూ.25,000 వరకు లభిస్తుంది.
అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.
ఈ పాలసీలు సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




