SCSS interest rate: పండుటాకులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా? వడ్డీ రేటు పెంపుపై భారీ ఆశలు!

|

Dec 22, 2022 | 2:26 PM

కొన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బాగా పెంచాయి. దాదాపు 9 శాతం వరకు రేటు పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఖతాదారులు కూడా తమ వడ్డీ రేటు పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు.

SCSS interest rate: పండుటాకులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా? వడ్డీ రేటు పెంపుపై భారీ ఆశలు!
Follow us on

అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిన రెపో రేటు తదితర అంశాల నేపథ్యంలో సీనియర్ సిటిజెన్స్ తమ ఖాతాలపై వడ్డీ రేటు పెంచే అవకాశాలపై ఆశావహంగా ఉన్నారు. పైగా కొన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బాగా పెంచాయి. దాదాపు 9 శాతం వరకు రేటు పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఖతాదారులు కూడా తమ వడ్డీ రేటు పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. వారి ఆశ నెరవేరుతుందా? ప్రభుత్వం వారిపై దయచూపుతుందా? వేచిచూడాల్సిందే!

ప్రస్తుతం వడ్డీ రేటు ఎంత..

సీనియర్ సిటీజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఖతాదారులకు ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు ఉంది. ఒకవేళ దీనిని ఈ నెల అంటే డిసెంబర్ 31 లోపు కనుక మార్పు చేయకపోతే వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ వరకూ మారే అవకాశం ఉండదు.

క్వార్టర్లీ మారుతుంది..

సీనియర్ సిటీజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఖతాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి క్వార్టర్ కు ఒకసారి మార్పు చేస్తుంటుంది. ఈ క్వార్టర్ కు మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఈ నెలాఖరుకు ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన ఈ రేటు వచ్చే క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి వరకూ అమలులో ఉంటుంది. అంటే ప్రభుత్వానికి వడ్డీ రేటు మార్చే ఉద్దేశం ఉంటే.. అది డిసెంబర్ 31లోపే ప్రకటన చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ పథకం ప్రయోజనాలు ఏమిటి?

ఎస్సీఎస్ఎస్ కింద ఖాతా ప్రారంభించిన వృద్ధులకు పలు రకాల ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తుంది. గతంలో ఈ ఖాతాలో వేసిన డిపాజిట్లపై దాదాపు 9 శాతం రిటర్న్స్ వచ్చాయి. అవేంటే ఓ సారి చూద్దాం..

  • దీనిలో డిపాజిట్లపై ప్రతి క్వార్టర్ కు ఒకసారి వడ్డీ మొత్తం డిపాజిట్ చేస్తారు. దానిని ఎప్పటికప్పుడు తీసేసుకోవచ్చు.
  • సాధారణ ఫిక్స్ డ్ డిపాజిట్లతో పోల్చుకుంటే ఎస్సీఎస్ఎస్ పథకంలో అధిక వడ్డీ వస్తుంది. అందువల్ల రిటర్న్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 గా ఉంది. ఇది బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ల కన్నా అధికం.
  • ఖాతాలో డిపాజిట్లపై వచ్చిన వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. రూ. 50,000 వరకూ వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది.
  • వృద్ధులు ఈ ఖాతాల్లో జమచేసే మొత్తంపై కూడా పన్ను రాయితీ ఉంటుంది. రూ. 1.5 లక్షల వరకూ సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ లభిస్తుంది.
  • ఎస్సీఎస్ఎస్ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని దానికి లింక్ చేసిన సాధారణ సేవింగ్స్ ఖాతాలోకి ఆటో క్రెడిట్ చేసుకోవచ్చు.
  • ఈ పథకంలో అత్యధికంగా రూ. 15లక్షల వరకూ ఒక క్వార్టర్ లో డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఇంటరెస్ట్ తీసుకోవచ్చు. ఈ అకౌంట్ మెచ్చూరిటీ పరిధి ఐదేళ్ల వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..