Best Recharge Plans: 90 రోజుల పాటు మీకు నో టెన్షన్.. మార్కెట్లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే… అవి కూడా ఫ్రీ..

రీఛార్జ్ ప్లాన్ గడువు తేదీ సమీపంలో ఉంటే టెలికాం కంపెనీలు రీఛార్జ్ చేసుకోవాల్సిందిగా ఎస్ఎంఎస్‌లు పంపిస్తూ ఉంటాయి. ఏ రీఛార్జ్ ప్లాన్ వేసుకుంటే మంచిదనే కన్‌ప్యూజన్ చాలామందిలో ఉంటుంది. ఏది వేసుకోవాలో తెలియక ఏదొక రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ కొన్ని చూద్దాం.

Best Recharge Plans: 90 రోజుల పాటు మీకు నో టెన్షన్.. మార్కెట్లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే... అవి కూడా ఫ్రీ..
Airtel Jio Recharge Plans

Updated on: Dec 07, 2025 | 3:38 PM

Data Plans India : దేశంలో అత్యధిక మంది మొబైల్ వినియోగదారులు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు సంస్థలు టెలికాం రంగంలో లీడింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. కస్టమర్లకు అనేక రీఛార్జ్ ప్లాన్లను పోటాపోటీగా అందుబాటులోకి తెస్తున్నాయి ఈ సంస్థలు. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్లాన్లను అనేకం అందిస్తున్నాయి. డైలీ, మంత్లీ, ఇయర్లీ కాలవ్యవధితో రీఛార్జ్ ప్లాన్లను అమలు చేస్తున్నాయి. నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను ఎక్కువమంది వాడుతూ ఉంటారు. ఇక 60 రోజుల వాలిడిటీ ప్లాన్లతో పాటు 90 రోజుల ప్లాన్లు కూడా వాడేవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఆయా సంస్థలు అందిస్తున్న 90 రోజుల వాలిడిటీలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ 90 రోజుల రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.929కు 90 రోజుల వాలిడిటీ ప్లాన్ అందిస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు పెర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్, హలోట్యూన్స్, స్పామ్ కాల్స్ / ఎస్ఎంఎస్ హెచ్చరికలు ఉచితంగా అందిస్తోంది.

జియో ప్లాన్స్

జియో రూ.899కే 90 రోజుల వాలిడిటీ ప్లాన్ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటాతో పాటు అదనంగా 20 జీబీ డేటా ఇందులో లభిస్తుంది. గూగుల్ జెమినీ ప్రొ, జియో హాట్‌స్టార్, జియో హోమ్, జియో ఏఐ క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఉచిత యాక్సెస్ అందిస్తోంది. దీంతో పాటు జియో రూ.195కే 90 రోజుల వాలిడిటీతో ప్లాన్ అందిస్తోంది. ఇందులో 15 జీబీ డేటా లభిస్తుంది. ఆ డేటా కంప్లీట్ అయ్యాక స్పీడ్ 64కేబీపీఎస్‌కి తగ్గిపోతుంది. ఇక 90 రోజుల పాటు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది.

వొడాఫోన్ ఐడియా ప్లాన్స్

ఇక వొడాఫోన్ ఐడియా రీఛార్జ్‌లలో రూ.151 డేటా ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది 90 రోజుల వ్యాలిడీటీతో 4జీబీ డేటా అందిస్తుంది. అలాగే 92 రోజుల పాటు హాట్‌స్టార్ ఫ్రీగా వినియోగించుకోవచ్చు. ఇక రూ.169 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో 8జీబీ డేటా అందిస్తోంది.