LIC New Plan: ఎల్‌ఐసీ నుంచి మరో బంపర్ ప్లాన్.. కేవలం ఒక్కసారి డబ్బులు కడితే చాలు.. ఇక జీవితాంతం మీకు లాభాలే

గత నెలలో పలు కీలక ప్లాన్లను విడుదల చేసిన ఎల్‌ఐసీ.. సంక్రాంతి పండుగ వేళ మరో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. జీవితాంతం బీమా రక్షణ కల్పించే ఈ పథకంలో అనేక బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ ప్లాన్ తీసుకునే సౌకర్యం ఉంది.

LIC New Plan: ఎల్‌ఐసీ నుంచి మరో బంపర్ ప్లాన్.. కేవలం ఒక్కసారి డబ్బులు కడితే చాలు.. ఇక జీవితాంతం మీకు లాభాలే
Life Insurance

Updated on: Jan 07, 2026 | 8:04 AM

కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లను పెంచుకునే పనిలో పడింది. ప్రైవేట్ బీమా సంస్థలకు పోటీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రైవేట్ ఇన్యూరెన్స్ కంపెనీలకు దీటుగా నిలిచేందుకు సర్వం ఒడ్డుతోంది. అందులో భాగంగా ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఎప్పుడూ ఏదోక కొత్త ప్లాన్‌ను తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే ఎల్‌ఐసీలో అనేక ఇన్యూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉండగా.. తాజాగా మరో నూతన ప్లాన్‌ను ప్రారంభించింది. జీవన్ ఉత్సవ్ పేరుతో లాంచ్ చేసి ఈ ప్లాన్ వివరాలు ఏంటి..? ఇందులో ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి..? కాలపరిమితి ముగిసిన తర్వాత ఎంత రాబడి వస్తుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

జీవన్ ఉత్సవ్ పాలసీ వివరాలు

-30 రోజుల వయస్సు ఉన్న పిల్లల నుంచి 65 ఏళ్ల పెద్దల వరకు పాలసీ తీసుకోవచ్చు
-ఈ నెల 12 నుంచి పాలసీ తీసుకోవచ్చు
-కనీసం రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి
-గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు
-ప్రతీ వెయ్యి పెట్టుబడికి రూ.40 చొప్పున ప్రతీ ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ అందుకోవచ్చు
-పాలసీదారుడు మధ్యలో మరణిస్తే పాలసీ మొత్తం సొమ్ముతో పాటు అప్పటివరకు అందించిన గ్యారంటీడ్ అడిషన్స్ నామినీకి అందిస్తారు
-ఇక మెచ్యూరిటీ పూరైన తర్వాత పాలసీదారుడికి మొత్తం బీమా సొమ్ముతో పాటు గ్యారంటీడ్ అడిషన్స్ కలిపి అందుకోవచ్చు
-ప్రతీ ఏటా బీమా సొమ్ముపై 10 శాతం ఆదాయం వస్తుంది
-ఇక చక్రవడ్డీ 5.5 శాతం ప్రతీ ఏటా అందుకోవచ్చు
-ఈ పాలసీకి మార్కెట్‌తో సంబంధం ఉండదు
-జీవితాంతం బీమా రక్షణ ఉంటుంది

-సింగిల్ ప్రీమియం వ్యక్తిగత పొదుపు జీవిత బీమా పథకం

జీవితాంతం బీమా రక్షణ

మంగళవారం ఎల్‌ఐసీ సీఈవో ఆర్.దొరైస్వామి ఈ బీమా పాలసీని ఆశిష్కరించారు. ఈ పాలసీ తీసుకుంటే జీవితాంతం ఆదాయంతో పాటు బీమా రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు. ప్రజలందరూ తీసుకుని బెనిఫిట్ పొందాలని సూచించారు. గత నెలలో ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్, జన్ సురక్షన్ ప్లాన్లను విడుదల చేసింది. అలాగే బీమా లక్షి, స్మార్ట్ పెన్షన్ ప్లాన్లను విడుదల చేసింది.