Jobs Vs. Business: భారతీయ యువకుల స్టైల్ మారింది.. ఒకరి కింద కాకుండా మరోలా ఆలోచిస్తున్నారు..

|

Aug 16, 2023 | 3:12 PM

దేశంలోని ప్రతి 10 మంది యువకులలో 7 నుంచి 8 మంది ఉద్యోగాల కంటే వ్యాపారం చేయాలనే ఆలోచిస్తున్నారు. ఉద్యోగం కంటే ఎక్కువ వృద్ధి వ్యాపారంలో ఉంటుందని నమ్ముతున్నారు. రానున్న నాలుగేళ్లలో భారత్‌లో వ్యాపారం చేయడం మరింత సులభతరం కానుంది. ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో వ్యాపారం కూడా కీలక పాత్ర పోషించనుందని యువత నమ్ముతున్నారు. వ్యాపారంలో కనిపించిన ఆర్ధిక వృద్ధి ఉద్యోగం చేయడంలో ఉండటం లేదని చాలా దృఢంగా విశ్వసిస్తున్నారు. తాజా సర్వేల్లో..

Jobs Vs. Business: భారతీయ యువకుల స్టైల్ మారింది.. ఒకరి కింద కాకుండా మరోలా ఆలోచిస్తున్నారు..
Jobs Vs. Business
Follow us on

భారత ప్రభుత్వం స్వావలంబన ప్రచారాన్ని వేగంగా ప్రోత్సహిస్తోంది. దేశం స్వావలంబన సాధించేందుకు మరిన్ని రంగాలు ఈ పరిధిలోకి రావాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన. దీంతో భారతదేశంలోని ప్రజలు ఉద్యోగం కంటే వ్యాపారం చేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. లోకల్ సర్కిల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, ప్రతి 10 మంది భారతీయులలో 7నుంచి 8 మంది వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడమే మేలని, అందులో ఎదుగుదల ఎక్కువని వారు భావిస్తున్నారు. అంతేకాదు, ఆర్ధికంగా ఎదగాలంటే వ్యాపారం చేయడమే మంచి ఆలోచన అని అంటున్నారు.

దేశంలోని 379 జిల్లాల్లో లోకల్ సర్కిల్ ఈ సర్వే నిర్వహించింది. 44 శాతానికి పైగా ప్రజలు ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మంచిదని నమ్ముతున్నట్లు తేలింది. వ్యాపారం చిన్నదే అయినా. అయితే ఇందులో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యాపారం చేయడం సులభమా..

ఈ సర్వేలో 55 శాతం మంది ప్రజలు రాబోయే కాలంలో భారతదేశంలో వ్యాపార అవకాశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందబోతున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2027 వరకు వ్యాపారం చేసే వారి వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి, భారతదేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో, Apple వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో రాబోయే కాలంలో భారత్ ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారుతుందని నేటికాలం యువత నమ్ముతున్నారు. దీంతో వ్యాపార విస్తరణ వేగంగా జరుగుతుందని ఈ సర్వేలో 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. కొత్త వ్యాపారావకాశాలు కూడా ఏర్పడతాయని.. కానీ కొంతమంది మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందగలుగుతారని.. ఇలాంటి సమయంలో మనం కూడా వ్యాపార రంగంలో ఉంటే తాము కూడా ఓ ఎంటర్టైనర్‌గా మారొచ్చని నేని యువత ఆలోచిస్తున్నారు.

ఉద్యోగం లేదా వ్యాపారం ఏది బెస్ట్..

ఆక్స్‌ఫామ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో ఉద్యోగ, వ్యాపారుల సంపద అంతరం గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. దేశ జనాభాలో కేవలం 5 శాతం మంది మాత్రమే దేశ సంపదలో 60 శాతం కలిగి ఉన్నారు. మొత్తం సంపదలో 50 శాతం జనాభా వాటా కేవలం 3 శాతం మాత్రమే. సంపదలో ఎక్కువ భాగం వ్యాపారం నుంచి మాత్రమే అని తేలింది.

4 సంవత్సరాలలో వ్యాపార అవకాశాలు పెరిగిన తీరు..

స్థానిక సర్కిల్ సర్వేలో.. భారతదేశంలో ఉపాధికి సంబంధించి సవాళ్లు ఉన్నాయని అంగీకరించింది. గత ఏడాది కాలంలో వేగవంతమైన రిట్రెంచ్‌మెంట్‌లు జరిగిన తీరు.. దాని ప్రభావం కూడా దీనిపై కనిపించింది. అదే సమయంలో వ్యాపార అవకాశాలు కూడా పెరిగాయి. ఈ సర్వే ప్రకారం, రాబోయే 4 సంవత్సరాలలో భారతదేశంలో వ్యాపార అవకాశాలు వేగంగా పెరుగుతాయి. కరోనాతో వ్యవహరించిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తీరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ శక్తులు కూడా భారత్ పట్ల సానుకూలంగా మారాయి. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం శబ్ధం వినిపిస్తుంటే మరోవైపు భారత్‌ ఆర్థిక సూచీలు నిరంతర వృద్ధిని నమోదు చేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం