బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది! ఈ వీడియో చూడండి!

బంగారం పెట్టుబడిపై అధిక లాభాలు ఆశించేవారికి ఈ కథనం ముఖ్యమైనది. రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత్‌లో బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, అంతర్జాతీయంగా ధరలు అంతగా పెరగడం లేదు. రూపాయి తిరిగి బలపడితే, బంగారంపై మీ పెట్టుబడి విలువ తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది! ఈ వీడియో చూడండి!
Gold 2

Updated on: Dec 06, 2025 | 12:32 AM

చాలా మంది ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు చూసి, దానిపై పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో మరింత ధర పెరిగి భారీ లాభాలు పొందవచ్చు అని ఆశిస్తున్నారు. అయితే నిజానికి మనకు ఇండియాలో బంగారం ధర పెరుగుతుందని అని అనిపిస్తున్నా.. గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ అంతగా పెరగడం లేదు. పైగా డాలర్‌తో పోల్చుకుంటే మన ఇండియన్‌ రూపీ రోజు రోజు దిజారిపోతుంది. రుపాయి విలువ అనేది పడిపోతుంది.

ప్రస్తుతం ఒక డాలర్‌ రూ.90లకు సమానంగా ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4200 డాలర్ల వరకు ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ.3,78,000 అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత రూపాయి విలువ కోలుకొని.. ఒక డాలర్‌కు రూ.86లకు సమానం అయితే.. అప్పుడు మీ బంగారం విలువ కూడా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని రాహుల్‌ అనే పర్సనల్‌ ఫైనాన్స్‌ అడ్వైజర్‌ వెల్లడించారు. పర్సనల్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తుంటారు. మరి ఆయన బంగారం పెట్టబడి గురించి ఏమన్నారో పూర్తిగా తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో చూసేయండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి