Gold Prices: బంగారం ధరల్లో సీన్ రివర్స్.. ఆదివారం ఒక్కసారిగా మారిన రేట్లు.. నేడు ఇలా..

బంగారం ధరలు మళ్లీ శాంతించాయి. గతం వారం నుంచి గోల్డ్ రేట్లు కాస్త తగ్గుతూ వస్తోన్నాయి. ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. ఆదివారం గోల్డ్ రేట్లు ఇలా..

Gold Prices: బంగారం ధరల్లో సీన్ రివర్స్.. ఆదివారం ఒక్కసారిగా మారిన రేట్లు.. నేడు ఇలా..
Today Gold And Silver Rates

Updated on: Jan 04, 2026 | 6:20 AM

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో కూడా గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉన్నాయి. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారంలో గోల్డ్ రేట్లు దిగి రావడంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. అసలే పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకొచ్చారు. గత వారం రేట్లు తగ్గడంతో ఈ వారం రేట్లు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఆదివారం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,820 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,24,500 వద్ద స్థిరంగా ఉంది.

-విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,820గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల రేటు రూ.1,24,500గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,35,820xగా ఉంది.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,24,500 వద్ద కొనసాగుతున్నాయి.

-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,37,460గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతోంది.

-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,970గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,650 వద్ద కొనసాగుతోంది.

 

వెండి ధరలు ఇలా..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,41,000గా ఉంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,57,000 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి.