ఇన్‌స్టాల్‌మెంట్ విధానంలో రోజువారీ అవసరాలన్నీ తీర్చుకునే వెసులుబాటు ఇప్పుడు పరిపాటిగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకొని గృహాలను నిర్మించుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇలా రుణం తీసుకున్నవారు తమ సంపాధనలో పెద్ద మొత్తం ఈఎంఐలకే సరిపోతుంది. అంతే కాదు చాలా కాలం పాటు ఈఎంఐ వాయిదాలు చెల్లించాల్సిన దుస్థితిలో కూరుకుపోతున్నారు.
అటువంటి దీర్ఘకాలిక గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా కాలక్రమేణా పెరుగుతుండటంతో.. రుణ గ్రహితలు EMI మొత్తాన్ని తగ్గించడం, రుణ కాల వ్యవధిని పొడిగించడం వంటి స్వల్పకాలిక ఉపశమనాన్ని కోరుకుంటారు. కాగా, దేశ ద్రవ్యోల్బణం లక్ష్యం 6 శాతానికి మించి పెరుగుతోంది. వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉంటాయని ఇది సూచిస్తుంది.
సాధారణంగా మన దేశాల్లో అందించే గృహ రుణ విధానంలో 15 నుంచి 20 సంవత్సరాల కంటే ఎక్కువ దీర్ఘకాలిక వడ్డీ వాయిదా ఉంటుంది. ఈ వాయిదా విధానంలో వడ్డీ రేట్లు ఏడాది పొడవునా పెరుగుతూనే ఉంటాయి. గృహ రుణం తిరిగి చెల్లించే సమయంలోనే కొత్త రుణగ్రహీతలకు EMIలు (సమానమైన నెలవారీ వాయిదాలు) మరింత భారంగా మారతాయి.
గృహ రుణ గ్రహీతలందరూ గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. రుణ కాల వ్యవధిని తగ్గించడానికి రుణగ్రహీత నెలవారీ ఆదాయం పెరిగినందున ఈఎంఐ మొత్తాన్ని పెంచడం. వాయిదా మొత్తాన్ని ఏటా కనీసం 5 శాతం ఇలా పెంరుగుతుంది. ఈ విధంగా గడువు తేదీకి ముందే రుణాన్ని చెల్లించవచ్చు. ఇది పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గృహ రుణాలను వేగంగా చెల్లించడానికి బోనస్‌లు, ఇతర అదనపు ఆదాయాలను ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి, అన్ని బ్యాంకుల గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8, 9 శాతం మధ్య ఉన్నాయి. అయితే డిపాజిట్లు అటువంటి రేట్లను అందించవు.
కాబట్టి, తక్కువ వడ్డీ డిపాజిట్‌ని ఎంచుకోకుండా.. దీర్ఘకాలిక రుణాన్ని చెల్లించడానికి ఆ మొత్తాన్ని ఉపయోగించండి. ఉదాహరణకు, ఒకరి గృహ రుణ వడ్డీ రేటు 8.55 శాతం, బ్యాంకు డిపాజిట్లు కేవలం 7 శాతం ఉంటే.. అతని ఆదాయం 20 శాతం పన్ను పరిధిలోకి వస్తే, డిపాజిట్ వార్షిక వృద్ధి రేటు 5.6 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంటి రుణాన్ని ముందుగానే చెల్లించండి. ప్రతి సంవత్సరం కనీసం నాలుగు అదనపు వాయిదాలు చెల్లించండి. ప్రధాన మొత్తంలో 5 నుంచి 10 శాతం డౌన్ పేమెంట్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వడ్డీ వ్యత్యాసం 0.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. రుణం పంపిణీకి విధించే రుసుము గురించి కూడా తెలుసుకోండి. రుణ నిష్పత్తి, ఆదాయం పెరిగితే వడ్డీ తగ్గింపు అవకాశం గురించి బ్యాంకుతో స్పష్టం చేయండి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం