Pay TM CEO: రిజర్వు బ్యాంక్ నిన్న జరిగిన ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో క్రెడిట్ కార్డులను యూపీఐ చెల్లింపులకు వీలుగా లింక్ చేసేందుకు వీలు కల్పించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం డిజిటల్ యూపీఐ చెల్లింపులకు మంచి ప్రోత్సాహకంగా నిలుస్తుందని పేటిఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేధికగా రిజర్వు బ్యాంక్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మెసేజ్ చేశారు. ముందుగా ఈ సదుపాయాన్ని రూపే ఆధారిత క్రెడిట్ కార్డులకు అందించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
This is a game changer move by RBI.
Also the beginning of MDR / Interchange of card networks starting to apply on mobile payments. https://t.co/SUAOp1qz0A— Vijay Shekhar Sharma (@vijayshekhar) June 8, 2022
UPI – Credit Card: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో ఆర్థిక అంశాల్లో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పెరిగాయి. యూపీఐ పేమెంట్స్ గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులోకి వచ్చాయి. కిరణా షాపులో వస్తువులు కొనుగోలు చేసినా.. యూపీఐ ద్వారా పేమెంట్స్ జరుపుతున్నారు దేశ ప్రజలు. అయితే, యూపీఐ పేమెంట్స్ విషయంలో మరో కీలక పురోగతి వచ్చింది. క్రెడిట్ కార్డును, యూపీఐతో లింక్ చేసే వెసులుబాటును కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది మొదట రూపే క్రెడిట్ కార్డుతో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యూపీఐ వినియోగదారులు డెబిట్ కార్డులు, సేవింగ్స్/కరెంట్ అకౌంట్స్ యాడ్ చేయడం ద్వారా లావాదేవిలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ని యూపీఐకి లింక్ చేసే సుదపాయం రావడంతో.. లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.
UPI యాప్‌లకు ఒకరి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్‌ని యాడ్ చేయడం ద్వారా, POS మెషీన్‌లో స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపు చేయవచ్చు. కేవలం QR కోడ్‌ని స్కాన్ చేసి, చెల్లింపులు చేయడానికి యాడ్ చేసిన క్రెడిట్/డెబిట్ కార్డ్‌ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి UPI యాప్ ద్వారా చెల్లింపులు ప్రారంభించిన తర్వాత, ఆ లావాదేవీలను పూర్తి చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. దాని ఆధారంగా చెల్లింపులు పూర్తవుతాయి.