Paytm Public Issue : భారతదేశ ప్రముఖ డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ పేటీఎమ్ శిఖరాగ్రానికి చేరుకోబోతోంది. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పేటీఎం బోర్డు ముందస్తు అనుమతినిచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా రూ. 22,000 కోట్ల వరకూ సమీకరించాలని పేటీఎమ్ భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 2 లక్షల కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువను ఆశిస్తున్నట్లు సమాచారం. ఐపీవో ద్వారా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాలను విక్రయించవచ్చని తెలుస్తోంది. పేటీఎమ్ ఆశించిన స్థాయిలో నిధులను సమీకరించగలిగితే.. దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలువబోతోంది. కాగా, పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబాకు చెందిన యాంట్ గ్రూప్‌నకు 29.71% వాటా, సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ (19.63%), సైఫ్ పార్టనర్స్ (18.56%)లతో పాటు విజయ్ శేఖర్ శర్మ (14.67%)ఏజీహెచ్ హోల్డింగ్, టీ రోవ్ ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్‌లకు ప్రముఖంగా వాటాలున్న సంగతి తెలిసిందే.