భవిష్యత్ భరోసాగా ఉండాలంటే కచ్చితంగా సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలనే విషయం తెలిసిందే. సంపాదించేది కొంచమైనా పొదుపు చేసుకునే అలవాటు ఉంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఇలా డబ్బు ఆదా చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రిస్క్ ఎక్కువ ఉన్నవి అయితే.. మరికొన్ని ఎలాంటి రిస్క్ లేనివి. ఇలాంటి రిస్క్ లేని స్కీమ్స్‌లో ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇలాంటి సేవింగ్స్ పథకాల్లో పోస్టాఫీస్ గ్రామీణ సురక్ష యోజన స్కీమ్ ఒకటి. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.? ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
గ్రామీణ సురక్ష యోజన పథకం కింద పాలసీదారుడు నెలకు రూ. 1515 చెల్లిస్తూ.. 55 ఏళ్ల టర్మ్ పాలసీ తీసుకుంటే మెచ్చూరిటీ సమయానికి మొత్తం 10 లక్షలు అవుతుంది. అయితే దీనికి ఇతర బెనిఫిట్స్ కలుపుకుని పాలసీదారుడికి మొత్తం రూ. 31,60,000 అందుతుంది. ఒకవేళ 60 ఏళ్ల టర్మ్‌కి పాలసీ తీసుకుంటే బెనిఫిట్స్‌తో కలిపి మొత్తం రూ. 34.60 లక్షలు పొందొచ్చు. ఈ పాలసీలో తీసుకోవడానినికి పాలసీదారుడి వయసు కనీసం 19 ఏళ్లు, గరిష్టం 55 ఏళ్లు ఉండాలి. కనీసం మొత్తం రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఉంటుంది. పాలసీదారుడు నాలుగేళ్ల తర్వాత రుణ సదుపాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒకవేళ పాలసీదారుడు ఐదేళ్ల కంటే ముందే పథకం నుంచి వీడినట్లైతే బోన్ వర్తించదు.
ఇక పాలసీదారుడు 59 ఏళ్ల వయసు వరకు పాలసీని ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ప్రీమియం చెల్లింపు నిలిచిపోయిన ఏడాది వరకు లేదా మెచ్యూరిటీ నిండిన ఏడాది లోపు ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునే అవకాశం ఉండదు. 55, 58, 60 ఏళ్ల వరకు ప్రీమియంను చెల్లించే అవకాశం ఉంటుంది. గ్రామీణ సురక్ష యోజన పథకంలో ప్రతీ ఏడాదికి రూ. 1000 మొత్తానికి రూ. 60 బోనస్‌గా ఉంటుంది. అయితే పాలసీదారుడు మెచ్చూరిటీ కంటే ముందే పాలసీని సరెండర్ చేస్తే మాత్రం బోన్ తగ్గుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..