Passport : 3 రోజుల పాటు పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ పనిచేయదు.. కేంద్రం కీలక ప్రకటన!

|

Aug 28, 2024 | 7:46 PM

ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి. కొన్ని దేశాలు వీసా మినహాయింపులను అందిస్తాయి. ఆ దేశాలను సందర్శించేందుకు వీసా అవసరం లేదు. అయితే ఏ దేశానికైనా పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ లేకుండా మీరు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించలేరు. అలా చేయడం చట్టవిరుద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా..

Passport : 3 రోజుల పాటు పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ పనిచేయదు.. కేంద్రం కీలక ప్రకటన!
Passport
Follow us on

ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి. కొన్ని దేశాలు వీసా మినహాయింపులను అందిస్తాయి. ఆ దేశాలను సందర్శించేందుకు వీసా అవసరం లేదు. అయితే ఏ దేశానికైనా పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ లేకుండా మీరు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించలేరు. అలా చేయడం చట్టవిరుద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పాస్‌పోర్టు ఉండాలి. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్‌కు సంబంధించిన కీలక సమాచారం విడుదలైంది. వచ్చే 3 రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ పనిచేయదని ప్రకటించారు.

 

ఇవి కూడా చదవండి


పాస్‌పోర్ట్ సర్వీస్ వెబ్‌సైట్ 3 రోజుల పాటు పనిచేయదు:

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో సైట్‌ నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ 3 రోజుల పాటు నిలిపివేయనుంది. పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లు 29 ఆగస్టు 8 నుండి సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిర్వహణలో ఉంటాయి. దీని కారణంగా సాధారణంగా ఆగస్టు 30వ తేదీన దేశవ్యాప్తంగా జోనల్ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Public Holidays: సెప్టెంబరు 7, 16న పబ్లిక్‌ హాలిడేస్‌.. విద్యార్థులకు వరుస సెలవులు.. ఎందుకో తెలుసా?

అదేవిధంగా, సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ వచ్చే 3 రోజుల పాటు నిలిపివేయబడుతుందని చెన్నై జోనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రకటించింది. బుక్ చేసుకున్న వారు ఇతర రోజుల్లో ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించినట్లు కూడా పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: PAN: తండ్రి పేరు లేకుంటే పాన్ కార్డు చెల్లుబాటు కాదా? వివరణ ఇచ్చిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి