Budget 2024: జూలై 22 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. అసలు బడ్జెట్‌ ఎప్పుడో తెలుసా?

|

Jul 06, 2024 | 5:36 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెబుతున్నారు. ఈ బడ్జెట్‌పై ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు శనివారం తెలిపారు...

Budget 2024: జూలై 22 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. అసలు బడ్జెట్‌ ఎప్పుడో తెలుసా?
Union Budget
Follow us on

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెబుతున్నారు. ఈ బడ్జెట్‌పై ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు శనివారం తెలిపారు.

ఈ విషయాన్ని కిరణ్ రిజిజు దీనిని X ద్వారా పంచుకున్నారు. జులై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, ఆగస్టు 12 వరకు బడ్జెట్‌తోపాటు పలు అంశాలపై చర్చలు ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి

 


భారత ప్రభుత్వ సిఫార్సుపై రాష్ట్రపతి బడ్జెట్ సమావేశాలను జూలై 22, 2024 నుండి ఆగస్టు 12, 2024 వరకు నిర్వహించే ప్రతిపాదనను ఆమోదించారు. 2024 కొరకు పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరిచారు. 024-25 కేంద్ర బడ్జెట్ జూలై 23, 2024న లోక్‌సభలో సమర్పించనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి