Pan Card: పాన్‌కార్డు అనేది శాశ్వత ఖాతా సంఖ్య (Permanent Account Number). ఎక్కువగా బ్యాంకు లావాదేవీలకు దీని అవసరం ఉంటుంది. బ్యాంక్ ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, లావాదేవీలు జరపడం మొదలైనవన్నీ ఉంటాయి. మీ పాన్ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా, పాడైపోయినా మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని కార్డును రీ ప్రింట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో సులువుగా అప్లై చేయవచ్చు. కార్డు వివరాల్లో ఎటువంటి మార్పులు లేకపోతే మాత్రమే దీనిని రీ ప్రింట్ చేయవచ్చు. NSDL e-Gov ద్వారా, తాజా పాన్ అప్లికేషన్ ద్వారా, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ ఈ-పాన్ సదుపాయాన్ని ఉపయోగించి పాన్‌కార్డు పొందవచ్చు.
పాన్ కార్డును తిరిగి ముద్రించడానికి మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html ఇందులో మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను పూరించాలి. కార్డును తిరిగి ముద్రించడానికి దరఖాస్తుదారు అంగీకరించాలి. చివరగా ఫారమ్‌ను సమర్పించడానికి మీరు క్యాప్చా కోడ్‌ని నమోదు చేయాలి. ఈ ప్రక్రియకు మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫారమ్ నింపిన తర్వాత, ఆన్‌లైన్‌లో చెల్లించాలి. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశం బయట ఉన్న చిరునామాకు కార్డును పంపించడానికి రూ.959 చెల్లించాలి. రుసుము చెల్లించిన తర్వాత మీ పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో లభించే చిరునామాకు పంపిస్తారు.
పాన్ కార్డ్ అనేది వ్యక్తిగతంగా చాలా కీలకమైనది. దీనిని భద్రంగా ఉంచుకోవాలి. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి ప్రతీ పనికి ఇది అవసరం. అందుకే మీ ‘పాన్’ విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. రుణాలు, అప్పుల విషయాన్ని పక్కన పెడితే.. చాలా చిన్న చిన్న వాటికి కూడా పాన్ తప్పనిసరి అయ్యింది. రైల్వేలో హోటల్స్ బుక్ చేయాలన్నా.. తత్కాల్ టిక్కెట్లు తీసుకోవాలన్నా.. పాన్ కార్డు తప్పనిసరి. కొన్నిసార్లు సిమ్ కార్డు తీసుకోవటానికి కూడా పాన్ కార్డ్ అవసరం పడుతుంది.