Pan Card: పాన్‌ నెంబర్‌ అర్థం తెలుసా..? పాన్‌ నెంబర్‌ వెనుక ప్రధాన రహస్యమిదే..!

పాన్‌ కార్డు అనేది దేశంలోని పౌరులకు ఆదాయపు పన్ను శాఖ అందించే ప్రత్యేక గుర్తింపు కార్డుఉ. పన్ను చెల్లింపుదారునికి పాన్ అనేది ఒక ముఖ్యమైన పత్రంగా ఉంటుంది.ముఖ్యంగా బ్యాంకు అకౌంట్‌ కావాలంటే పాన్‌ కార్డు అనేది తప్పని సరి చేశారు. ఈ నేపథ్యంలో అసలు పాన్‌ నెంబర్‌లోని అర్థం ఏంటి? అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి పాన్‌ నెంబర్‌ అర్థాన్ని వివరంగా ఓ సారి తెలుసుకుందాం.

Pan Card: పాన్‌ నెంబర్‌ అర్థం తెలుసా..? పాన్‌ నెంబర్‌ వెనుక ప్రధాన రహస్యమిదే..!
Pan Card

Updated on: May 14, 2025 | 11:47 AM

పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసినప్పుడు, సాధారణ పౌరులు ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు, అధిక-విలువ లావాదేవీలు చేసినప్పుడు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టినప్పుడు పాన్‌ కార్డు తప్పనిసరి అవసరంగా మారుతుంది. అయితే మనలో చాలా మందికి ఇప్పటికీ పాన్‌ కార్డు నెంబర్‌ గురించి తెలియదు.పాన్ అనేది అన్ని ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలను అనుసంధానించే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది భారత పౌరులతో పాటు కంపెనీలు, ఇతర సంస్థలకు జారీ చేసే 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ గుర్తింపు సంఖ్య. ఈ నేపథ్యంలో పాన్‌ కార్డులోని నెంబర్‌కు ప్రత్యేక అర్థం ఉందని చాలా మందికి తెలియదు. కాబట్టి పాన్‌ కార్డు గురించి మరిన్ని వివరాలను చూద్దాం. 

పాన్ నంబర్ అర్థం 

  • పాన్ నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. పాన్‌ కార్డులోని మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు అక్షర శ్రేణితో ఉంటుంది.
  • నాలుగో అక్షరం పాన్ హోల్డర్ రకాన్ని చూపుతుంది, అవి: వ్యక్తి, కంపెనీ, హెచ్‌యూఎఫ్‌, ఏఓపీ, బీఓఐ, ప్రభుత్వ సంస్థ, కృత్రిమ న్యాయవ్యవస్థ వ్యక్తి, స్థానిక అధికారం, సంస్థ, ట్రస్ట్‌ వివరాలను తెలుపుతుంది. 
  • ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్‌లోని ఐదో అక్షరం హోల్డర్‌కు సంబంధించిన చివరి పేరు లేదా ఎంటిటీ పేరుకు సంబంధించి మొదటి అక్షరాన్ని చెబుతుంది.
  • అక్షరం తర్వాత ఉన్న నాలుగు సంఖ్యలు 0001 నుంచి 9999 వరకు ఉన్న సంఖ్యను తెలుపుతాయి.
  • చివరి అక్షరం అక్షరమాల చెక్ అంకెను స్పష్టం చేస్తుంది. 

పాన్ కార్డు ధ్రువీకరణ ఇలా

  • మీరు ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నెన్స్ సర్వీస్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ పాన్ కార్డును ఆన్‌లైన్‌లో ధ్రువీకరించవచ్చు.
  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • ‘పాన్ స్థితిని ధ్రువీకరించండి ట్యాబ్‌ను ఎంచుకోవాలి.
  • పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి మీ పాన్ వివరాలను నమోదు చేయాలి. 
  • ఓటీపీతో ధ్రువీకరించండి, కంటిన్యూ బటన్‌ ఎంచుకుంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ మీ పాన్‌ ధ్రువీకరణ పూర్తి అవుతుంది.