Pan Card: పాన్ కార్డు ఇనాక్టివ్ అయిందా..? నో టెన్షన్.. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో యాక్టివేట్ చేసుకోండిలా..

పాన్ కార్డు ఇనాక్టివ్ అయిందా.. అయితే మీరు సులువుగా ఆన్‌లైన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోవడం వల్ల ఇనాక్టివ్ అవుతుంది. దీని వల్ల మీరు ఎలాంటి పాన్ సేవలు పొందలేరు.

Pan Card: పాన్ కార్డు ఇనాక్టివ్ అయిందా..? నో టెన్షన్.. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో యాక్టివేట్ చేసుకోండిలా..
Pan Card

Updated on: Jun 27, 2026 | 11:44 AM

దేశంలో అనేక ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా పాన్ కార్డు పనిచేస్తుంది. కేవలం ఆర్ధిక వ్యవహారాల కోసమే కాకుండా అనేక సేవలకు గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు, బ్యాంకు ఖాతా తెరవడం, మ్యూచువల్ ఫండ్స్‌, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తి కొనడం లేదా విక్రయించడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం లాంటి అనేక కార్యకలాపాలకు పాన్ అవసరం. మీ పాన్ పనిచేయకపోతే మీరు చాలా ఆర్ధిక సేవలను పొందలేరు. దీంతో పాన్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోవడం వల్ల ఇనాక్టివ్‌గా మారే అవకాశముంటుంది. ఆధార్-పాన్ లింక్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో పాన్ కలిగిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానించాలి.

ఇనాక్టివ్ ఎందుకు అవుతుంది..?

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ ఇనాక్టివ్‌ చేస్తుంది. ఉచితంగా ఇందుకు ఇచ్చిన గడువు ముగియడంతో ప్రస్తుతం ఆలస్య రుసుం చెల్లించే లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అనుసంధానం చేసుకోకపోతే మీకు పాన్ కార్డు సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల మీ పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

యాక్టివేట్ చేసుకోవడం ఎలా..?

-ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి
-ఆధార్-పాన్ లింకింగ్ ఆప్షన్ ఎంచుకోండి
-మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయండి.
– నిర్దేశించిన రుసుమును ఆన్ లైన్ ద్వారా చెల్లించండి.
– మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఓటీపీ ధృవీకరణ పూర్తి చయండి
– అభ్యర్థ సమర్పించిన తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పరిశీలించి ఆమోదం తెలుపుతుంది
– ఆమోదం పొందిన తర్వాత పాన్ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఎన్ని రోజుల సమయం పడుతుంది..?

రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత పాన్ సాధారణంగా వెంటనే యాక్టివ్ అవ్వదు. రికార్డులను అప్‌డేట్ చేసే ముందు డిపార్ట్‌మెంట్ మీ వివరాలను పరిశీలిస్తుంది. ధృవీకరణ స్థితిని బట్టి ప్రాసెసింగ్ సమయం మారవచ్చు. ఈ సమయంలో పన్ను చెల్లింపుదారులు పలుమార్లు అభ్యర్థనలు పంపకుండా ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. సమీపంలోని పాన్ కార్డు కార్యాలయానికి వెళ్లి ఆప్‌లైన్ విధానంలో యాక్టివేట్ చేసుకోవచ్చు.

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..?

-ఆదాయపు పన్ను శాక ఈ-ఫైలింగ పోర్టల్‌లోకి వెళ్లాలి

-ఆధార్-పాన్ లింకింగ్ స్టేటస్ ఎంచుకోండి

– పోర్టల్‌లో పాన్ వివరాలను నమోదు చేయండి

– స్టేటస్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది

Follow Us