PAN Card: పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే రూ.10 వేల జరిమానా!

PAN Card: చెల్లుబాటు లేని పాన్‌లను ఉపయోగించి చేసిన లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు AI, డేటా విశ్లేషణలను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది మోసగాళ్లను గుర్తించడమే కాకుండా, తప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లు, నకిలీ రీఫండ్ క్లెయిమ్‌లు..

PAN Card: పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే రూ.10 వేల జరిమానా!

Updated on: Jun 12, 2025 | 9:18 AM

మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేయండి. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ అటువంటి పాన్ కార్డుదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాన్ ఆధార్‌తో లింక్ చేయని వారి ద్వారా ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగితే, వారిపై రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఎందుకంటే పన్ను ఎగవేతను ఆపడం, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం కోసం అదాయపు పన్ను శాఖ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుటోంది.

ఈ లావాదేవీలపై జరిమానా:

మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు ఇప్పటికీ దాన్ని ఉపయోగిస్తుంటే మీరు అనేక ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలపై జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వీటిలో బ్యాంకు ఖాతాను తెరవడం లేదా నిర్వహించడం, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం వంటివి ఉన్నాయి. ఈ అన్ని సందర్భాల్లో నిష్క్రియాత్మక పాన్‌ను ఉపయోగిస్తే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద ప్రతి లావాదేవీకి రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు.

ఇవి కూడా చదవండి

లింక్ చేయకపోతే PAN నిష్క్రియం:

ప్రభుత్వం ఇప్పటికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. నిర్ణీత గడువులోపు ఇది చేయకపోతే పాన్ కార్డు నిష్క్రియం అవుతుంది. ఇది చెల్లుబాటు కాదు. దీనివల్ల ఆర్థిక లేదా పన్ను సంబంధిత పనులు చేయడం అసాధ్యం అవుతుంది. అలాగే, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారిపై కూడా శాఖ నిఘా ఉంచింది. వారికిపై భారీ జరిమానా వేయనుంది.

AI ద్వారా నిఘా:

చెల్లుబాటు లేని పాన్‌లను ఉపయోగించి చేసిన లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు AI, డేటా విశ్లేషణలను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది మోసగాళ్లను గుర్తించడమే కాకుండా, తప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లు, నకిలీ రీఫండ్ క్లెయిమ్‌లు, పెద్ద లావాదేవీలను కూడా నివారిస్తుంది.

పన్ను చెల్లింపుదారులు ఏమి చేయాలి?

ఇంకా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు వెంటనే దీన్ని చేయాలి. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా దీన్ని ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఇది చేయకపోతే, పాన్‌ను సస్పెండ్ చేయవచ్చు. బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయవచ్చు. అలాగే పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం కూడా అసాధ్యం అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి