PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా? షాకింగ్ న్యూస్ మీకోసమే..

|

Apr 13, 2021 | 2:28 PM

PAN-Aadhaar Linking: పాన్ కార్డ్-ఆధార్ కార్డ్‌ని ఇంకా లింక్ చేయలేదా? అయితే మీకు భవిష్యత్‌లో ఇబ్బందు తప్పవు. అవును.. ప్రభుత్వం ఇదే...

PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా? షాకింగ్ న్యూస్ మీకోసమే..
Pan Aadhar Link
Follow us on

PAN-Aadhaar Linking: పాన్ కార్డ్-ఆధార్ కార్డ్‌ని ఇంకా లింక్ చేయలేదా? అయితే మీకు భవిష్యత్‌లో ఇబ్బందు తప్పవు. అవును.. ప్రభుత్వం ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వస్తోంది. పాన్-ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ చేయాలని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. అలాగే గడువు కూడా పెంచుతూ వస్తోంది. ఈ దఫా పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయనట్లయితే చిక్కులు తప్పవని ప్రభుత్వ వర్గాలు ఖరాకండిగా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు గడువు పెంచిన కేంద్రం.. ఈ సారి జూన్ 30, 2021 నాటికి ఆధార్ కార్డును పాన్ కోర్డుతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. గడువు లోపు లింకప్ చేసుకోకపోతే.. సదరు వ్యక్తులకు రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పాన్ కార్డు కూడా రద్దు అవుతుందంటున్నారు.

వాస్తవానికి మార్చి 31, 2021 లోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ దేశ ప్రజలకు సూచించింది. అయితే కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటం, దాని దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ గడువును కాస్తా ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీని మళ్లీ జూన్ 30, 2021 వకు పొడిగిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని ఆదాయపు పన్ను విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆదాయపు పన్నుచ ట్టం సెక్షన్ 139AA 1961 ప్రకారం జూన్ 30వ తేదీలోపు అందరూ ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనకంటే

కాగా, మీరు మీ పాన్‌ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేయాలనుకుంటే.. ఈ లింక్‌ (https://www.incometaxindiaefiling.gov.in/home)పై క్లిక్ చేసి ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాన్ కార్డ్-ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినట్లయితే ఆ విషయం కూడా అందులో చూపిస్తుంది. ఫోన్ ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. 567678 లేదా 56161 కు మెసేజ్ పంపి ఆధార్-పాన్ కార్డులను లింక్ చేసుకోవచ్చు.

Also read:

Tirupati by elections: తిరుపతిలో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు నాటకాలు.. తిరుపతి ఘటనపై హోంమంత్రి సుచరిత రియాక్షన్

Ugadi 2021: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్