PAN-Aadhaar link: ఇదే లాస్ట్ చాన్స్.. లావాదేవీలన్నీ ఆగిపోతాయ్! పెన్షనర్లు అలర్ట్ అవ్వాల్సిందే..
2023, జూన్ 30లోపు ఆధార్ పాన్ లింక్ చేయకపోతే జూలై 1 నుంచి మీ పాన్ డీయాక్టివ్ అయిపోతుంది. పాన్ ఆధారంగా జరిగే అన్ని లావాదేవీలు నిలిచిపోతాయి. ముఖ్యంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదారులు తీవ్రంగా నష్టపోతారు.
మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేశారా? ఇంకా చేయకపోతే వెంటనే చేసేయండి. లేకుంటే జరిమానా పడుద్ది. ముఖ్యంగా పెన్షనర్లు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంస్థ పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్), ఆధార్ లింక్ చేసేందుకు గడువు పెంచింది. 2023 జూన్ 30 వరకూ ఈ రెండింటినీ లింక్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. గతంలో మార్చి 23, 2023 వరకూ ఆధార్, పాన్ లింక్ చేసేందుకు ప్రభుత్వం సమయాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ గడువును పెంచుతూ జూన 30 వరకూ అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ డెవలప్మెంట్ అథారిటీ కూడా గడువులోపు పెన్షనర్లు అందరూ ఆధార్ పాన్ లింక్ చేసుకోవాలని.. లేకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) అకౌంట్ కు సంబంధించిన లావాదేవీలు నిలిచిపోతాయని హెచ్చరించింది.
ఎన్పీఎస్ వినియోగదారులకు అలర్ట్..
పాన్ నంబర్ అనేది ఎన్పీఎస్ ఖాతాదారులకు చాలా కీలకం. నో యువర్ కస్టమర్ (కేవైసీ) కు సంబంధించిన పాన్ తప్పనిసరి. ప్రతి ఖాతాదారుడు ఈ కేవైసీని అప్ డేట్ చేసుకోవాలి. అందుకు పాన్ తప్పనిసరి. అందుకే వచ్చే జూన్ 30 లోపు ఎన్పీఎస్ ఖాతాదారులు ప్రతి ఒక్కరూ తమ పాన్ నంబర్ ను ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. ఎన్పీఎస్ లావాదేవీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగాలంటే ఇది వెంటనే చేసి తీరాలి. లేకపోతే ఖాతా నిలిచిపోతుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ రైజ్ అవుతుంది. ఎన్పీఎస్ లావాదేవీలపై పరిమితులు వస్తాయి. తద్వారా ఖాతాదారులు ఇబ్బదులు పడతారు.
లింక్ చేయకపోతే..
- జూన్ 30లోపు ఆధార్ పాన్ లింక్ చేయకపోతే జూలై 1 నుంచి చేయాలనుకొంటే రూ. 1000 జరిమానాగా విధిస్తారు.
- ఒకవేళ నిర్లక్ష్యంగా వదిలేస్తే జూలై ఒకటి నుంచి మీ పాన్ డీయాక్టివ్ అయిపోతుంది.
- అప్పుడు ఎటువంటి రీఫండ్లు ఆ పాన్ పై జరగవు.
- ఎన్పీఎస్ ఖాతాదారులకు వడ్డీ చెల్లింపులు జరగవు. పాన్ డీయాక్టివ్ అయ్యి ఉన్నన్ని రోజులు ఎటువంటి రాదు. తర్వాత యాక్టివేట్ చేసినా డీయాక్టివ్ అయిన రోజులకు వడ్డీ రాదు.
- టీడీఎస్, టీసీఎస్ అధిక రేటుకు కట్ అవుతుంది. చట్ట ప్రకారం ఇది జరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..