Ratan Tata: రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటో తెలిస్తే..

|

Oct 28, 2024 | 9:47 PM

Ratan Tata: రతన్ టాటా కృషి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ యూనివర్సిటీ భారతీయులందరి హృదయాలను గెలుచుకుంది. ఈ భవనం విద్యకు దీటుగా నిలుస్తుంది..

Ratan Tata: రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటో తెలిస్తే..
Follow us on

Ratan Tata: రతన్ టాటా కృషి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ యూనివర్సిటీ భారతీయులందరి హృదయాలను గెలుచుకుంది. ఈ భవనం విద్యకు దీటుగా నిలుస్తుంది. భారతీయ పరిశ్రమ ప్రపంచంలో ఒక లెజెండ్ రతన్ టాటా అక్టోబర్ 9న ముంబైలో కన్నుమూశారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో టాటా గ్రూప్ సామాజిక కార్యక్రమాల పని జరుగుతోంది. అందుకే టాటా అనే పేరు భారతీయుల మదిలో మెదులుతోంది. ఇప్పుడు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రతన్ టాటాను గౌరవించాలని నిర్ణయించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించనుంది. ఈ భవనాన్ని టాటా గ్రూప్, సోమర్‌విల్లే కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్మించనున్నాయి. విశ్వవిద్యాలయంలో బోధన, విద్యా కార్యకలాపాల నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం.

ఇది కూడా చదవండి: Post Office Scheme: సూపర్‌ స్కీమ్‌.. నెలకు రూ.1500 డిపాజిట్‌ చేస్తే చాలు.. చేతికి రూ.31 లక్షలు!

రతన్ టాటా విలువలకు నివాళి:

ఇవి కూడా చదవండి

2025లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ భవనం ఫిబ్రవరి-మార్చి నెలలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ‘రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్’లో నిర్మించనున్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్‌విల్లే కళాశాలతో ఈ భాగస్వామ్యం టాటా విలువలకు నివాళి అని అన్నారు. రతన్‌ టాటా పేరు మీద నిర్మించిన భవనం భారతదేశానికి ఒక ముఖ్యమైన పరిశోధనా కేంద్రం అవుతుందన్నారు. మానవాళి సంక్షేమం కోసం రతన్ టాటా చేస్తున్న కృషికి ఇది నివాళి అని పేర్కొన్నారు.

యూనివర్సిటీలోని ఈ భాగంలోనే భవనం:

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో రతన్ టాటా పేరుతో ఉన్న భవనం ఆక్స్‌ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (OICSD)కి శాశ్వత నివాసంగా మారుతుంది. ఈ కేంద్రం బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఎదురుగా ఉంటుంది. కొత్త భవనాన్ని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌లు మోరిస్ కో డిజైన్ చేయనున్నారు. ఈ సంస్థ మొదటి ప్రాజెక్ట్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ భవనం 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.

రతన్ టాటా చేసిన కృషి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ యూనివర్సిటీ భారతీయులందరి హృదయాలను గెలుచుకుంది. ఈ భవనం విద్యకు దీటుగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: Reliance Jio: జియో యూజర్లకు దీపావళి కానుక.. ఈ రెండు ప్లాన్లపై రూ.3350 వోచర్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి