ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ OPPO జనవరి 16న తన కొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతుంది. గత కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఊరిస్తున్న OPPO A78 5G మోడల్ ఎట్టకేలకు ఈ రోజు వారికి ఊరటనివ్వనుంది. ఎన్నో అద్భుతమైన నూతన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగా పిక్సల్స్‌తో ఉంది. ఇక ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాటరీ: ఈ రోజు భారత మార్కెట్‌లోకి విడుదల కానున్న OPPO A78 5G స్మార్ట్‌ఫోన్‌కి కంపెనీ 5000 mAh బ్యాటరీని అందించింది, అంతేకాక దీని చార్జింగ్ సపోర్ట్ 33W SuperVOOC కావడం దీని ప్రత్యేకత.
డిస్ప్లే: ఈ OPPO A78 5G స్మార్ట్‌ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది.
చిప్‌సెట్: ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం Mali G7 MC2 GPU ఉపయోగించింది కంపెనీ.
కెమెరా సెటప్: ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో పాటు 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఫోన్ ముందు భాగంలో ఉంది.
భారతీయ మార్కెట్లోకి ఈ రోజే రానున్న ఈ OPPO A78 5G స్మార్ట్‌ఫోన్ ధరను దాని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మోడల్ ఫోన్ రూ. 20 వేల కంటే తక్కువ ధరతోనే అందుబాటులోకి వస్తుందనే అంచనాలు భారిగానే ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..