Covid Ads: వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదులు.. 332 కోవిడ్‌ యాడ్స్‌లో 12 మాత్రమే సరైనవట: స్పష్టం చేసిన ఏఎస్‌సీఐ

| Edited By: Anil kumar poka

Jul 27, 2021 | 10:34 AM

Covid Ads: మన ప్రతి రోజు టీవీల్లో ఎన్నో యాడ్స్‌ను చూస్తుంటాము. రకరకాల యాడ్స్‌ యాడ్స్‌ల అందులో వచ్చే ప్రోడక్ట్స్‌ వల్ల కొందరు ఆకర్షితులవుతుంటారు. అయితే వివిధ రకాల..

Covid Ads: వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదులు.. 332 కోవిడ్‌ యాడ్స్‌లో 12 మాత్రమే సరైనవట: స్పష్టం చేసిన ఏఎస్‌సీఐ
Follow us on

Covid Ads: మన ప్రతి రోజు టీవీల్లో ఎన్నో యాడ్స్‌ను చూస్తుంటాము. రకరకాల యాడ్స్‌ యాడ్స్‌ల అందులో వచ్చే ప్రోడక్ట్స్‌ వల్ల కొందరు ఆకర్షితులవుతుంటారు. అయితే వివిధ రకాల వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టిస్తుంటాయి. ఈ యాడ్స్‌పై పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) గత ఆర్థిక సంవత్సరంలో 6,140 యాడ్స్‌ను పరిశీలించింది. ఇందులో కోవిడ్‌కు సంబంధించినవి 332 ప్రకటనలు ఉండగా, అందులో 12 ప్రకటనలు మాత్రమే సరైనవని ఏఎస్‌సీఐ తేల్చింది. అయితే ప్రకటనలను పరిశీలించిన బృందాల్లో మైక్రోబయాలజిస్ట్‌ల వంటి నిపుణులు కూడా ఉన్నారు. అయితే కొన్ని సంస్థలు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు రకరకాల యాడ్స్‌ను ఇచ్చాయి.

ప్రకటనల్లో అవాస్తవాలను నియంత్రించాలని ఆయుష్‌ మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఏఎస్‌సీఐ చర్యలు చేపట్టింది. ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత మొత్తం 237 అభ్యంతకరమైన యాడ్స్‌ ఉన్నట్లు మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువచ్చింది. వీటిలో ప్రకటనకర్తలు 164 యాడ్స్‌లో పలు మార్పులు చేశారు. మరో 73 ప్రకటనలపై మరింత లోతైన పరిశీలన జరపాల్సి ఉంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వీటిపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది.

పలు సంస్థలు అనుకూలంగా మార్చుకునేందుకు..

కాగా, ప్రజల కరోనా సంబంధిత ఆందోళనను పలు సంస్థలు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాయని ఏఎస్‌సీఐ సెక్రటరీ జనరల్‌ మనీషా కపూర్‌ పేర్కొన్నారు. వీటిలో ఆహార, రంగులు, సబ్బులు, లేపనాలు, వాటర్‌ ప్యూరిఫయర్లు, ప్లైవుడ్‌లు సహా పలు ఉత్పత్తుల ప్రకటనలు ఉన్నాయని వెల్లడించారు. వీటితో పాటు విద్యారంగంలో 1,406, ఆహారం-పానీయాల రంగంలో 147 సహా మరికొన్ని రంగాల్లో 364 ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.