Onions Price Today: రూ. 25కే కిలో ఉల్లి.. హైదరాబాద్‌లో రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు

|

Nov 05, 2023 | 10:48 AM

దేశంలో ఉల్లి ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఊరట కల్పించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రిటైల్‌ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద రూ.25కే కిలో ఉల్లిని విక్రయిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌ పంట ఆలస్యమవుతుండటంతో దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతుందన్న కేంద్రం ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుత దేశీయ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. దీంతో తక్కువ ధరకే ప్రజలకు ఉల్లి అందుబాటులోకి తీసుకురావాలని..

Onions Price Today: రూ. 25కే కిలో ఉల్లి.. హైదరాబాద్‌లో రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు
Aggressive Retail Sale Of Onions
Follow us on

న్యూఢిల్లీ, నవంబర్‌ 5: దేశంలో ఉల్లి ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఊరట కల్పించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రిటైల్‌ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద రూ.25కే కిలో ఉల్లిని విక్రయిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌ పంట ఆలస్యమవుతుండటంతో దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతుందన్న కేంద్రం ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుత దేశీయ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. దీంతో తక్కువ ధరకే ప్రజలకు ఉల్లి అందుబాటులోకి తీసుకురావాలని బఫర్‌ స్టాక్‌ కింద రూ.5.06 లక్షల టన్నుల ఉల్లిని కేంద్రం సేకరించింది. వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు.. వినియోగదారుల, ఆహార పౌర సరఫరా శాఖలు సంయుక్తంగా రిటైల్‌ అవుట్‌లెట్ల, మొబైల్ వ్యాన్‌ల ద్వారా అమ్మకాలను ప్రారంభించింది.

నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), కేంద్రీయ భండార్ ఇతర రాష్ట్ర-నియంత్రిత సహకార సంస్థలు రాష్ట్ర పరిధిలోని పలు సహకార సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ సహకార సంస్థల ద్వారా కిలో ఉల్లిని రూ.25కే విక్రయిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ సహకార సంస్థ 21 రాష్ట్రాల్లో 329 రిటైల్‌ పాయింట్లు, మొబైల్‌ వ్యాన్లను ఏర్పాటు చేసింది. జాతీయ వినియోగదారుల సహకార సంస్థ కూడా 20 రాష్ట్రాల్లో 457 రిటైల్‌ పాయింట్లను ప్రారంభించింది.

దక్షిణాది రాష్ట్రాల్లో.. హైదరాబాద్ వినియోగదారులకు ఉల్లిపాయలను రిటైల్ విక్రయిందుకు అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ అసోసియేషన్ (HACA) సంస్థ రిటైల్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది. రబీ, ఖరీఫ్‌ పంటల ఉత్పత్తిలో ఏర్పడ్డ హెచ్చుతగ్గులను సమన్యయం చేయడానికి కేంద్రం ఉల్లి బఫర్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఉల్లి ధరలు తగ్గే వరకు రాయితీతో రూ.25కే విక్రయిస్తామని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 5.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి సేకరించిన కేంద్రం ఆ ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.