Onion Price: మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. భారీగా పెరగనున్న ధరలు!

|

Feb 20, 2024 | 3:24 PM

ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఉల్లి ధరలు పెరిగాయి. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లిపాయల మార్కెట్, లాసల్‌గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC) సోమవారం సగటు హోల్‌సేల్ రేట్లలో 40 శాతం పెరిగింది. సోమవారం కనిష్ట ధరలు క్వింటాల్‌కు రూ.1,000, గరిష్టంగా..

Onion Price: మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. భారీగా పెరగనున్న ధరలు!
Onion Price
Follow us on

వెల్లుల్లి ధరల పెరుగుదలతో కిచెన్ బడ్జెట్ పూర్తిగా పాడైపోయిన కొద్ది రోజుల తర్వాత, ఉల్లి ధరలు ఇప్పుడు సామాన్యుల జేబుకు చిల్లులుప పెట్టేలా ఉంది. ఉల్లి ధరల పెంపు ఇంటి వంటశాలలు, రెస్టారెంట్లకు సవాళ్లను సృష్టిస్తోంది. ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఉల్లి ధరలు పెరిగాయి. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లిపాయల మార్కెట్, లాసల్‌గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC) సోమవారం సగటు హోల్‌సేల్ రేట్లలో 40 శాతం పెరిగింది. సోమవారం కనిష్ట ధరలు క్వింటాల్‌కు రూ.1,000, గరిష్టంగా రూ.2,100గా నమోదవగా, ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.1,280 నుంచి రూ.1,800 పెరిగింది.

నిషేధం ఎంతకాలం నుంచి అమలులో ఉంది?

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 11, 2023న దేశీయ వినియోగదారులకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందుబాటులో ఉంచడానికి డిసెంబర్ 8, 2023 నుండి మార్చి 31, 2024 వరకు ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించినట్లు ప్రకటించింది కేంద్రం. వినియోగదారులు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉల్లి పంట లభ్యత, ధరలపై నిశితంగా గమనిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ధరల స్థిరీకరణ కింద, రైతులు కూడా నష్టపోకుండా ఉల్లి సేకరణ కొనసాగుతుంది. అలాగే, ప్రైస్‌వాలా టోకు, రిటైల్ మార్కెట్‌లలో వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిపాయలను అందించడం కొనసాగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ధరల గురించి మాట్లాడినట్లయితే, ఫిబ్రవరి 18 న, వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో ఉల్లిపాయ సగటు ధర కిలోకు రూ. 29.83. ఫిబ్రవరి 19న అదే సగటు ధర రూ.32.26కి చేరింది. అంటే 24 గంటల్లో దేశంలో ఉల్లి సగటు ధర కిలోకు రూ.2.43 పెరిగింది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పరుగులు పెడుతున్న వెల్లుల్లి ధర

కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో వెల్లుల్లి ధరలు రూ.550కి చేరగా, పలు నగరాల్లో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో వెల్లుల్లి ధరలు కిలో రూ. 500-550 మధ్య అమ్ముడవుతున్నాయి. నాణ్యమైన వెల్లుల్లి హోల్ సేల్ మార్కెట్ లో రూ.220 నుంచి రూ.240కి విక్రయిస్తుండగా, దేశంలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్ లో కిలో రూ.400కి చేరింది. ది హిందూ రిపోర్టు ప్రకారం, తిరుచ్చిలోని గాంధీ మార్కెట్‌లోని రిటైల్ షాపుల్లో 1 కిలో మంచి నాణ్యత గల వెల్లుల్లిని రూ. 400కి విక్రయిస్తున్నారు. అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చాలా మెట్రో నగరాల్లో కిలో వెల్లుల్లి ధరలు రూ. 300 నుండి రూ. 400 వరకు ఉన్నాయని నివేదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి