రబీ సీజన్‌లో వేసిన ఉల్లి ఇప్పుడిప్పుడే పంట పొలాల నుంచి భారీగా మార్కెట్‌కు వస్తోంది. అయినప్పటికీ దాని ధర (onion price) ప్రస్తుతం రిటైల్ రంగంలో కిలోకు 25 రూపాయల వద్ద నడుస్తోంది. అతిపెద్ద ఉల్లి ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలో టోకు ధర ప్రస్తుతం క్వింటాల్ 1100 నుండి 1500 రూపాయల వరకు నడుస్తోంది. గత సంవత్సరం ఈ సమయంలో సగటు ధర క్వింటాల్ 400 నుండి 600 రూపాయలు మాత్రమే ఉంది. దీనికి ప్రధాన కారణం ఉత్పత్తి లేకపోవడం. అయినప్పటికీ ఇంత టోకు ధర వద్ద కూడా రైతులకు ప్రత్యేక ప్రయోజనం లభించడం లేదు. ఎందుకంటే ఖర్చు కిలోకు సుమారు 16 రూపాయలు వస్తోంది.
మహారాష్ట్ర ఉల్లిపాయ సాగుదారుల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భారత్ దిఘోలే మాట్లాడుతూ ఈ సంవత్సరం నకిలీ విత్తనాలు, ఆలస్యంగా విత్తడంతోపాటు వర్షం, వడగళ్ళు కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అందుకే ధర పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఎకరానికి సగటున 16 టన్నుల దిగుబడి లభించేంది. అయితే ఈసారి సగటున 10 నుండి 13 టన్నులు మాత్రమే లభించింది. దీంతో కిలోకు సగటున 11 నుండి 15 రూపాయల ఖర్చు రైతు మీద పడింది. పంట తక్కువగా ఉంటే ధరల పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది.
ఉల్లి ఉత్పత్తి చేయడానికి కిలోకు రూ .9.34 ఖర్చవుతుందని నేషనల్ హార్టికల్చర్ బోర్డు 2017 లో చెప్పింది. ఇది నాలుగేళ్లలో 15 నుంచి 16 రూపాయలకు పెరిగింది. రైతులు ఇంకా నష్టపోతున్నారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బు లేదా భూమి కౌలు కూడా లభించడం లేదని వాపోతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్ నగర్, పూణే, ధూలేతోపాటు సోలాపూర్ జిల్లాల్లో ఉల్లి పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఈ అన్ని ప్రదేశాలలో ఈ ఏడాది ఉత్పాదకత చాలా తగ్గింది.
రైతులందరికీ ఇంట్లో ఉల్లిపాయలు ఉంచడానికి తగినంత స్థలం ఉండదు. దీనికి తోడు వారిపై చాలా ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. పంట బయటకు వచ్చిన వెంటనే వాటిని మార్కెట్‌కు (మండి) తీసుకువెళతారు. ఒక గ్రామంలో 100 మంది రైతులు ఉంటే కేవలం 10 మందికి నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టోర్ నిర్మించడానికి ప్రభుత్వం చాలా తక్కువ ఆర్థిక సహాయం అందిస్తుంది. 25 టన్నుల నిల్వకు 4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా 87,500 రూపాయలు మాత్రమే ఇస్తుంది. 2000 మంది రైతులు తహసీల్‌లోని దుకాణం కోసం దరఖాస్తు చేస్తే.. అప్పుడు లాటరీలో 100 మంది రైతులను ఎంపిక చేస్తారు. అందువల్ల పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మవలసిన పరిస్థితి ఉంటుందని ఉల్లి రైతు అంటున్నారు.
మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, గుజరాత్, కర్ణాటకతోపాటు రాజస్థాన్‌లలో ఉల్లి పంట అధికంగా పండుతుంది. దేశంలో వార్షిక ఉల్లి ఉత్పత్తి సగటున 2.25 నుండి 25 మిలియన్ మెట్రిక్ టన్నుల మధ్య ఉంటుంది.
ప్రతి సంవత్సరం కనీసం 15 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అమ్ముతారు.
– నిల్వ చేసేటప్పుడు సుమారు 10 నుండి 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయ చెడిపోతుంది.
– సరిగ్గా 35 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయ ఎగుమతి అవుతుంది.
-20-21-21లో దీని ఉత్పత్తి 26.09 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనా.
-ఈ సంవత్సరం, 2020-21లో, ఇది 15,95,000 హెక్టార్లలో సాగు చేయబడింది.