వన్‌ప్లస్ ఇటీవల కమ్యూనిటీ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో వన్ ప్లస్12, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 వంటి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఈవెంట్ శుక్రవారం ప్రారంభమైంది. అలాగే డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ సేల్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12 ధర రూ. 6,000 తగ్గుతుంది. అలాగే అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.7,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై వినియోగదారులు రూ. 3,000 తగ్గింపు ఆఫర్‌ను కూడా పొందవచ్చు. వన్‌ప్లస్ 12 ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 64,999గా ప్రకటించిన విషయం విధితమే.
వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ-4పై 2,000 ఫ్లాట్ తగ్గింపును, అలాగే వన్‌ప్లస్ నార్డ్ 4పై రూ. 3,000 తగ్గింపును కూడా అందిస్తుంది. ఈ రెండు మిడ్-రేంజ్ ఫోన్‌లపై అదనపు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. నార్డ్ సీఈ-4 కొనుగోలుదారులు ఐసీఐసీబ్యాంక్, వన్ కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 ఇన్‌స్టంట్ తగ్గింపు పొందవచ్చు. అలాగే నార్డ్ 4ని కొనుగోలు చేస్తే రూ. 2,000 బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. అలాగే వన్‌ప్లస్ నార్డ్ సీఈ-4 లైట్ ఫోన్‌పై కూడా రూ. 2,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. అలాగే రూ. 1,000 బ్యాంక్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే వన్‌ప్లస్ టాబ్లెట్‌లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లపై కూడా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ ప్యాడ్-2 ధర రూ. 2,000 తగ్గుతుంది. అలాగే శుక్రవారం నుంచి ప్యాడ్ గోపై రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. ప్యాడ్ 2 కొనుగోలుపై రూ. 3,000, ప్యాడ్ గోపై రూ. 2,000 అదనపు బ్యాంక్ తగ్గింపు కూడా ఉంటుంది. భారతదేశంలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో-3 ధర రూ. 1,000 తగ్గుతుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 అదనపు బ్యాంక్ తగ్గింపు కూడా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి