Rahul Bajaj Passed away: పద్మ భూషన్ అవార్డు గ్రహీత, భారత ప్రఖ్యాత వ్యాపరవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూశారు. బజాజ్ ఆటో(Bajaj auto) సంస్థ మాజీ ఛైర్మన్ గా సేవలు అందించిన 83 ఏళ్ల రాహుల్ బజాజ్ పుణెలో మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. రాహుల్ బజాజ్ న్యుమోనియా, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గతంలో ఆయన రాజ్యాసభ సభ్యునిగా కూడా తన సేవలను అందించారు. దీనిపై వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బజాజ్ ఆటో భారత్ లోనే రెండవ అతి పెద్ద వాహన తయారీ సంస్థ. జూన్ 10, 1938లో జన్మించిన రాహుల్ బజాజ్.. సంస్థకు పూర్తిస్థాయి డైరెక్టర్ గా 50 ఏళ్లకు పైగా కంపెనీ కోసం సేవలు అందించారు. ఆ తరువాత 82 ఏళ్ల వయస్సులో రాహుల్ బజాజ్ ఏప్రిల్ 2021 న పదవి నుంచి తప్పుకున్నారు. ఎక్కువ ప్రాచుర్యం పొందిన ‘హమారా బజాజ్’, ‘యూ కెనాట్ బీట్ బజాజ్’ లాంటి ట్యాగ్ లైన్లు ఆయన నేత్రుత్వంలో నడిచిన దిగ్గజ టూవీలర్ కంపెనీ రూపొందించినవే.
ఇవీ చదవండి:
Black hawk Chopper: గాల్లో చక్కర్లు కొట్టిన పైలెట్ రహిత ఛాపర్ .. వైరల్ వీడియో మీకోసం..
N Chandrasekaran: రూ. 15.29 లక్షల కోట్లు పెరిగిన టాటా మదుపరుల సంపద.. దీని వెనుక బాహుబలి అతనేనా..