Ola Electric Scooter: ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఆ రెండు రోజులే అవకాశం..!

Ola Electric Scooter: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఊరట కలిగిస్తున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో..

Ola Electric Scooter: ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఆ రెండు రోజులే అవకాశం..!

Updated on: Mar 15, 2022 | 12:51 PM

Ola Electric Scooter: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఊరట కలిగిస్తున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక మొదట ఓలా (Ola) నుంచి ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ప్రో స్కూటర్‌ (Electric S1 Pro Scooter)అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విక్రయాలు మార్చి 17, 18వ తేదీల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు సైతం ఉంటాయి. గ్లాసీ ఫినిష్‌తో స్పెషల్‌ ఎడిషన్‌ గెరువా రంగులో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఆ రెండు రోజులలో మాత్రమే ఈ రంగు వాహనం అందుబాటలో ఉంటుందని, ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు 17, కొత్తవారు 18న కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఎస్‌1 ప్రో ఇప్పటికే 10 కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇక హోలీ పండగ నేపథ్యంలో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ వాహనం బుకింగ్‌ ప్రారంభం కాగానే సర్వర్‌ సైతం స్తంభించిపోయింది. దీంతో దశల వారీగా బుకింగ్స్‌ను ప్రారంభిస్తోంది కంపెనీ. ఎలక్ట్రిక్‌ వాహనం అందుబాటులోకి రాగానే లక్షలాది మంది బుకింగ్‌లు చేసుకుంటున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వాహనాలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని సీఈవో తెలిపారు.

 

ఇవి కూడా చదవండి:

Royal Enfield Scram 411: మార్కెట్ లోకి కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ లాంఛ్.. బైకర్స్ మెచ్చే ధరలోనే..

Interest Rate: వాటి వడ్డీ రేట్ల విషయంలో RBI కీలక నిర్ణయం.. రుణగ్రహీతలకు ఆ వివరాలు తెలపాల్సిందేనని ఆదేశం..