Ola Electric Scooter:పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ వాహనాల కంపెనీలు కూడా ఈవీ వాహనాలు తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక ముందుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు పోటా పోటీగా బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఓలా కస్టమర్లకు షాకిచ్చే వార్తను వినిపించింది. ఓలా ఎలక్ట్రిక్ 2022 చివరి వరకు Ola S1 ఇ-స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే S1 ప్రో మోడల్‌కు డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లకు స్కూటర్స్ అందలేదు. డెలివరీ చేసేందుకు ఇచ్చిన గడువు దాటిపోయింది. దీంతో కస్టమర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ మోడల్ ఉత్పత్తిని నిలిచివేస్తున్నట్లు వెల్లడించింది. గత నెలలో S1 డెలివరీలను కంపెనీ ప్రారంభించినప్పటికీ, S1ని బుక్ చేసుకున్న కస్టమర్‌లకు S1 ఈ సంవత్సరం చివర్లో తయారు చేయబడుతుందని ఇప్పటికే కస్టమర్లకు సమాచారం అందించింది ఓలా కంపెనీ. కస్టమర్లలో అత్యధికులు S1 ప్రోను ఎంచుకున్నారు.
S1ని ఆర్డర్ చేసిన కస్టమర్‌లను Ola యాప్ ద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవాలని తెలిపింది. చివరి చెల్లింపులు జనవరి 21 నుండి అందుబాటులో ఉంటుందని తెలిపింది. డెలివరీలు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి 10-20 రోజుల వ్యవధి ఇవ్వబడుతుంది. ఫిబ్రవరి వరకు డెలివరీలు చేయనున్నట్లు తెలిపింది. అయితే S1 ఉత్పత్తి పునఃప్రారంభమైన వెంటనే కస్టమర్‌లకు తెలియజేయబడుతుందని తెలిపింది. కాగా, S1 ప్రో గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో, S1 90 కిలోమీటర్ల వేగంతో అందుబాటులోకి తీసుకువచ్చింది ఓలా కంపెనీ. S1 ప్రోతో పోలిస్తే S1 121km పరిధిని కలిగి ఉంది. దీని పరిధి 181km ఉంది.
ఇవి కూడా చదవండి: