Ola Electric Scooter: ఓలా స్కూటర్‌ రికార్డ్‌.. 24 గంటల్లో రూ.600 కోట్ల విలువైన స్కూటర్ల విక్రయాలు.!

|

Sep 16, 2021 | 1:39 PM

Ola Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు వాహనాల కంపెనీలు కూడా..

Ola Electric Scooter: ఓలా స్కూటర్‌ రికార్డ్‌.. 24 గంటల్లో రూ.600 కోట్ల విలువైన స్కూటర్ల విక్రయాలు.!
Ola Electric Scooter
Follow us on

Ola Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు వాహనాల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు ద్విచక్ర వాహనాలు సైతం అందుబాటులోకి రాగా, ఇంకొన్ని వాహనాలు త్వరలో మార్కెట్లో విడుదల కానున్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసిన ఓలా స్కూటర్‌ ఆగస్టు 15 మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్‌ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్లు వేగంగా విక్రయాలు కొనసాగాయి. కేవలం 24 గంటల్లో 600 కోట్ల రూపాయల విలువైన స్కూటర్లను విక్రయించినట్లు ఓలా తెలిపింది. ప్రతి సెకనుకు 4 స్కూటర్లను విక్రయించినట్లు సాఫ్ట్‌ బ్యాంక్‌ ఆధారిత కంపెనీ తెలిపింది. అయితే గత వారం వెబ్‌సైట్‌లో లోపాల కారణంగా ఇ-స్కూటర్‌ అమ్మకాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక బుధవారం తిరిగి బుకింగ్‌ను ప్రారంభించింది. ఓలా యాప్‌లో ఈ స్కూటర్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు తమ స్లాట్‌లను బుక్‌ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓలా చైర్మన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవేష్‌ అగర్వాల్‌ బ్లాగ్‌లో ఓ పోస్టు చేశారు. కేవలం 24 గంటల్లో రూ.600 కోట్లకుపైగా విలువైన స్కూటర్లను విక్రయించామని, వినియోగదారుల స్పందన అంచనాలకు మించి ఉందని అన్నారు. విడుదల కాకముందే ఈ స్కూటర్‌పై ఎన్నో అంచనాలు హల్ నెలకొని ఉన్నాయి. వీటితోపాటు ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. కేవలం రూ. 499లతో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందించడంతో విడుదలైన రోజే దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లతో రికార్డు నెలకొల్పింది.

రెండు వేరియంట్లలో ఓలా స్కూటర్స్‌..

ఓలా ఈ -స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఓలా ఎస్1, ఎస్1 ప్రో. ఇక ఓలా ఎస్ 1 ధర రూ. 1,41,400- ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండగా, సబ్సిడీ రూపంలో.99,999లతో అందుబాటులో ఉంది. ఓలా ఎస్1 ప్రో రూ .1,29,999లలో లభించనుంది. కేంద్రం అందించే సబ్సిడీలతో పలు రాష్ట్రాల్లో ధరల్లో మార్పులుంటాయి.

ఓలా ఫీచర్స్‌:

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌తో వస్తుంది. ఇది రైడర్‌కి కఠినమైన ట్రాఫిక్ పరిస్థితుల నుంచి సులభంగా బయటపడేందుకు సహాయపడుతుంది. అలాగే హిల్ హోల్డ్ ఫీచర్‌తో ఎత్తుపైకి వెళ్లేటప్పుడు ఏమంత కష్టంగా ఉండబోదు. ఈ-స్కూటర్ కూడా క్రూయిజ్ కంట్రోల్ మోడ్‌తో కూడిన పవర్ లేదా బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు మూడు మోడ్‌లతో పనిచేయనుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్‌ మోడ్స్‌లో పనిచేస్తుంది. అలాగే ఓలా ఎస్1 కేవలం 3 సెకన్లలో 0kmph నుంచి 40kmph వరకు వెళ్లగలదు. అలాగే గరిష్టంగా 115 కి.మీ. వెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిమీల వరకు వెళ్తుందని కంపెనీ వెల్లడించింది.

ఫుల్ ఛార్జ్‌తో ఓలా S1 డ్రైవింగ్ రేంజ్ 181 కి.మీ:

ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించిన వివరాల మేరకు S1 స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 181 కి.మీ. చేరుకోగలదు. అలాగే S1 స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40 kmph వరకు వెళ్లగలదని అగర్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనం గరిష్టంగా 115 కి.మీ వెళ్లగలదని ఆయన వెల్లడించారు.

ఛార్జింగ్ సమయం:

ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50శాతం వరకు ఈ-స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని ఓలా కంపెనీ తెలిపింది. రెగ్యులర్ ఛార్జింగ్ స్టేషన్‌లో, ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి ఫుల్ ఛార్జ్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. ఇంట్లో ఒక సాధారణ ప్లగ్‌తో 5.5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ సబ్సీడీ:

ఓలా ఈ-స్కూటర్ 50శాతం ఛార్జ్‌తో 75 కిమీ వరకు ప్రయాణం చేయగలదని వెల్లడించింది. ఇది ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిమీ ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాహనం 3.4kWh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో ప్రభుత్వ FAME-II సబ్సిడీకి అర్హత పొందుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ కలర్స్:

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు, సిల్వర్ షేడ్స్‌లో మ్యాట్, గ్లోస్ ఎంపికల్లో ఉండనున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలందించేందుకు ఓలా ఈ-స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి వేరియంట్ 2kW మోటార్ కలిగి ఉంటుంది. ప్రాథమిక మోడల్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీ. రెండవ మిడ్ వేరియంట్ 4kW మోటార్ కలిగి ఉంటుంది. గరిష్టంగా 70 kmph వేగాన్ని పొందగలదు. ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ టాప్-ఎండ్ వేరియంట్ 7kW మోటార్ కలిగి ఉంటుంది. అలాగే గరిష్టంగా 95 kmph వేగాన్ని కలిగి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి: Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌.. డబ్బులు లేకపోయినా.. రూ.70 వేల వరకు షాపింగ్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

EPF Account: మీకు ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉందా..? ఈ ఫామ్‌ నింపితే రూ. 7 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..!

Jio Phone Next: జియోకు కొత్త చిక్కులు.. జియో నెక్ట్స్‌ ఫోన్‌ ధర పెరగనుందా..?