Festival Offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్స్ తెలిస్తే షోరూంకి క్యూ కట్టేస్తారంతే..

ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్స్‌ కొనాలనుకునే వారికి ఇదో బంఫర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా పండుగ ఆఫర్‌ కింద తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్‌ ప్రకంటించింది. ఈ ఆఫర్స్‌తో మీరు ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కేవలం రూ.49,999 కే పొందవచ్చు. కాబట్టి ఓలా ఏ వాహనాలపై, ఎలాంటి ఆఫర్స్ ఇస్తుందో తెలుసుకుందాం పదండి.

Festival Offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్స్ తెలిస్తే షోరూంకి క్యూ కట్టేస్తారంతే..
Electric Scooters Offers

Updated on: Sep 23, 2025 | 6:18 PM

ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్స్‌ కొనాలనుకునే వారికి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా గుడ్‌ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల కోసం ఓలా.. ఓలా సెలబ్రేట్స్ ఇండియా అనే సరికొత్త ఫెస్టివల్‌ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌ కింద ఓలా తమ ఉత్పత్తులపై భారీ డిస్కైంట్స్‌ ఇవ్వనుంది. ముహూర్త మహోత్సవ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్స్ అక్టోబర్‌ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రారంభం ధర రూ.49,999గా ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఓలా ఫెస్టివల్‌ ఆఫర్‌ పూర్తి వివరాలు..

ఈ ఆఫర్ కింద రూ. 81,999 ప్రారంభ ధరతో లాంచ్‌ అయిన 2 kWh మోడల్ Ola S1X ను కేవలం రూ. 49,999 కు కొనుగోలు చేయవచ్చు

అలాగే రూ. 99,999 ప్రారంభ ధరతో లాంచ్‌ అయిన 2.5 kWh వేరియంట్ Ola Roadster X ను కేవలం రూ. 49,999 కు కొనుగోలు చేయవచ్చు

ఓలా S1 ప్రో+ (5.2 kWh), రోడ్‌స్టర్ X+ (9.1 kWh) మోడల్స్‌ కూడా ఇప్పుడు రూ. 99,999 ధరకు రానున్నాయి. ఈ రెండూ టాప్-స్పెక్ మోడల్స్ తో వస్తున్న వాహనాలు, వీటిలో 4,680 బ్యాటరీ ఉంటుంది. లాంచింగ్ సమయంలో ఈ రెండు వాహనాల ప్రారంభ ధరలు వరుసగా.. రూ. 1,69,999, రూ. 1,89,999గా ఉన్నాయి. ఇప్పుడు పండగా ఆఫర్‌ కింద ఇవి కేవలం రూ.99,999కు రానున్నాయి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్‌లో నుంచి సేకరించిన వివరాల మేరకు అందించడం జరిగింది. వీటిపై మరిన్ని ఆఫర్స్ తెలసుకునేందుకు మీ సమీపంలోని ఓలా షో రూమ్‌ను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.