ఒకినావా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సరుకు రవాణాకు సూపర్.. ధర ఎంతో తెలుసా..

|

Jan 23, 2021 | 8:39 PM

Okinawa Dual Electric Scooter: ఒకినావా సంస్థ తాజాగా ఇండియాలో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకినావా డ్యూయల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఒకినావా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సరుకు రవాణాకు సూపర్.. ధర ఎంతో తెలుసా..
Follow us on

Okinawa Dual Electric Scooter: ఒకినావా సంస్థ తాజాగా ఇండియాలో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకినావా డ్యూయల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది స‌రుకుల ర‌వాణాల‌కు చ‌క్కగా సూట్ అవుతంది. అలాగే వ్యక్తిగత అవ‌స‌రాల‌కు కూడా వినియోగించుకోవ‌చ్చు. ఇది సుమారు 200 కిలోల వరకు లోడింగ్ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో లోడింగ్ క్యారియర్‌లతో వస్తుంది. గ్యాస్ సిలిండర్లు, హెవీ హార్డ్‌వేర్ పరికరాలు, వాటర్ కేన్లు, కిరాణా వ‌స్తువులు, మందులు, కోల్డ్ స్టోరేజ్ మరియు మరిన్ని వస్తువులను పంపిణీ చేయడానికి వీలుగా దీనిని రూపొందించారు. ఇందుకోసం ఒకినావా డెలివరీ బాక్స్ ల‌ను ఈ స్కూట‌ర్‌కు అమ‌ర్చారు. ఈ ఒకినావా డ్యూయల్ ధర రూ.58,998.

ఒకినావా డ్యూయ‌ల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైర్ రెడ్ మరియు సన్షైన్ ఎల్లో రంగుల్లో అందుబాటులో ఉంది. ఓకినావా డ్యూయల్ 70 శాతం మెటల్ బాడీతో త‌యారుచేశారు. ప్రస్తుతం, కంపెనీ తన ఉత్పత్తులలో 92 శాతం ఇక్కడే త‌యారు చేస్తున్నారు. ఏప్రిల్ 2021 నాటికి 100 శాతానికి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకినావా డ్యూయల్ 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో న‌డుస్తుంది. 25 కిలోమీటర్ల గ‌రిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్‌సి గానీ అవసరం లేదు. 75కిలోల బ‌రువు క‌లిగిన ఈ బండికి వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌, ముందువైపు డిస్క్ బ్రేక్ ను అమ‌ర్చారు. స్కూటర్‌లోని 48W 55Ah డిటాచ‌బుల్‌(వేరు చేయగలిగిన) లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. ఇది 1.5 గంటల్లో 80 శాతం వరకు మరియు 4 నుంచి 5 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఒకే ఛార్జీతో 130 కిలోమీటర్లు ప్రయాణించ‌వ్చని కంపెనీ పేర్కొంది.

Vodafone Idea: వైద్య సేవలు ప్రారంభించనున్న వొడాఫోన్ ఐడియా.. 600 ఆస్పత్రులు.. 400పైగా డాక్టర్లు..