Ola Festival sale: భలే ఆఫర్ బాస్.. ఓలా ఎస్1 ఈవీలపై భారీ డిస్కౌంట్..!

|

Oct 30, 2024 | 11:08 AM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు విపరీతంగా పెరిగింది. చాాలామంది వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్ తీరుకు అనుగుణంగానే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. వీటిలో ఓలా కంపెనీ వాహనాలకు ఆదరణ బాగుంది. మార్కెట్ లో వీటికి మంచి స్థానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్బంగా ఓలా కంపెనీ 72 అవర్స్ రష్ ను ప్రారంభించింది.

Ola Festival sale: భలే ఆఫర్ బాస్.. ఓలా ఎస్1 ఈవీలపై భారీ డిస్కౌంట్..!
Ola Scooters
Follow us on

బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ లో (బీవోఎస్ఎస్)(బాస్)లో భాగంగా ఎస్ 1 పోర్ట్ పోలియో లోని వాహనాలపై రూ.25 వేలు తగ్గింపు ప్రకటించింది. అలాగే రూ.30 వేలు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా అందజేస్తోంది. అక్టోబర్ 29న మొదలైన ఈ సేల్ 31వ తేదీ వరకూ అమలులో ఉంటుంది. ఓలా కంపెనీ ప్రకటించిన ఆఫర్ ద్వారా ఖాతాదారులకు ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో భాగంగా ఎస్1 పోర్టుపోలియో ధర రూ.74 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ వంటి హైఎండ్ మోడళ్లు రూ.1.14 లక్షలు ఉంటాయి. ఎస్ 1 వాహనాలపై రూ.25 వేల తగ్గింపుతో పాటు ఫైనాన్సింగ్ ఆప్షన్లు, పొడిగించిన బ్యాటరీ వారంటీ, ఉచిత సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ లు, చార్జింగ్ క్రెడిట్, ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలతో రూ.30 వేలు విలువైన అదనపు ప్రయోజనాలు అందజేస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మంగళవారం 2.6 శాతం తగ్గిపోయాయి. దాని ఐపీవో ధర రూ.76 కంటే దిగువకు వచ్చేసింది. ఇంట్రాడేలో రూ.74.84 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు నాటి గరిష్ట ధర రూ.157.4 తో పోల్చితే దాదాపు 50 శాతం కన్నా తక్కువకు చేరుకున్నాయి. లిస్టింగ్ సమయంలో రూ.60 వేల కోట్లకు చేరిన క్యాపిటలైజేషన్ ఇప్పుడు కేవలం రూ.33 వేల కోట్లు మాత్రమే ఉంది.

బాస్ ద్వారా అందజేసే ప్రయోజనాలు

  • ఓలా ఎస్1 పోర్ట్ పోలియో వాహనాలు రూ.74,999 నుంచి ప్రారంభమవుతాయి.
  • ఓలా ఎస్1 పోర్ట్ పోలియో వాహనాలపై రూ.25 వేలు వరకూ తగ్గింపు లభిస్తుంది.
  • అదనపు ప్రయోజనాల్లో భాగంగా రూ.7 వేలు విలువైన 8 ఏళ్లు / 80 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ ఉచితంగా అందిస్తారు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.5 వేల వరకూ ఫైనాన్స్ ఆఫర్లు అందుతాయి.
  • రూ.6 వేలు విలువైన మూవ్ ఓఎస్ ప్లస్ అప్ గ్రేడ్ లభిస్తుంది. రూ.7 వేలు విలువైన ఉచిత క్రెడిట్ చార్జింగ్ అందిస్తారు. అలాగే రూ.5 వేలు విలువైన ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటుంది. వీటి విలువ దాదాపు రూ.30 వేల వరకూ ఉంటుంది.

టైర్ 2, 3 నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించడానికి చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా అమ్మకాలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది. కంపెనీ సర్వీస్ నెట్ వర్క్ ను 2024 డిసెంబర్ నాటికి వెయ్యి కేంద్రాలకు రెట్టింపు చేయనుంది. అలాగే 2025 నాటికి సేల్స్, సర్వీస్ ను మెరుగుపర్చుకునేందుకు పదివేల మంది కొత్త పార్టనర్లను ఆన్ బోర్డు చేయనుంది. ఈవీల రీపేర్ల కోసం లక్షమంది మెకానిక్ లను సన్నద్దం చేయడానికి ఈవీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..