2021లో అమ్మకాల పరంగా ముంబైలో టాప్-20 డెవలపర్‌ల ర్యాంకింగ్‌లో ఒబెరాయ్ రియాల్టీ మొదటి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం మొదటి స్థానంలో ఉన్న రన్‌వాల్ గ్రూప్‌ను దాటేసింది. 2017 నుంచి మూడుసార్లు టాప్‌గా నిలిచిన లోధా గ్రూప్ 2020లో రెండో స్థానానికి పడిపోయి 2021లోనూ అదే స్థానంలో కొనసాగుతోంది. ఒబెరాయ్ గ్రూప్ 2019లో ఐదో స్థానంలోనూ, 2020లో నాలుగో స్థానంలోనూ ఉంది. మొదటి సారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2020లో అగ్రస్థానంలో నిలిచిన రన్‌వాల్ గ్రూప్ 2021లో మూడో స్థానానికి పడిపోయింది. అత్యంత ప్రసిద్ధి చెందిన గోద్రెజ్ ప్రాపర్టీస్ చాలా వెనుకబడి, టాప్ 10లోకి రావడంలో విఫలమైంది. ఇది 12వ స్థానంలో నిలిచింది.
ఒబెరాయ్ రియాల్టీ 2021లో రూ. 44 బిలియన్ల అమ్మకాలు చేసింది. లోధా రూ. 36 బిలియన్లు, రన్వాల్ గ్రూప్ రూ. 34 బిలియన్లతో ముందుంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 8 బిలియన్ల విక్రయాలను చేసింది. ఇది షాపూర్జీ పల్లోంజీ, హీరానందానీ గ్రూప్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంటే చాలా తక్కువ. ముంబై ఒక కీలకమైన మార్కెట్ ఎందుకంటే డెవలపర్‌లు ఏ ఇతర భారతీయ టైర్ 1 నగరం లేదా మెట్రో కంటే ఈ నగరంలో ఎక్కువ మార్జిన్‌లు సాధిస్తారు. ఈ కారణంగానే ఇతర నగరాల్లో ఉన్న కొత్త డెవలపర్లు ముంబైలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. అంచనాల ప్రకారం, హైదరాబాద్, ముంబై అత్యధిక సంఖ్యలో కొత్త డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని కొత్త డెవలపర్ల శాతం 2021లో మొత్తం యాక్టివ్ డెవలపర్‌లలో 18-19 శాతంగా ఉంది. ముంబైలో 11-12 శాతం మంది ఉన్నారు. దీనికి విరుద్ధంగా, గురుగ్రామ్, నోయిడాలో కొత్త డెవలపర్ల సంఖ్య రెండు శాతం కంటే తక్కువగా ఉంది.
Read Also.. Armed Forces Flag Day: అమరజవాన్ల ఫ్యామిలీలకు అండగా ఎస్బిఐ.. గవర్నర్ తమిళసై కు భారీ విరాళం అందజేత