NPSలో పెట్టుబడి పెడితే నెలకు1.5 లక్షల పెన్షన్ పొందవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..

|

Nov 22, 2021 | 9:05 PM

NPS: మీరు ప్రైవేట్ ఉద్యోగులా.. అయితే ఈ వార్త మీ కోసమే. ప్రయివేటు రంగంలోని వ్యక్తులు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పెన్షన్ గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే

NPSలో పెట్టుబడి పెడితే నెలకు1.5 లక్షల పెన్షన్ పొందవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..
Epf
Follow us on

NPS: మీరు ప్రైవేట్ ఉద్యోగులా.. అయితే ఈ వార్త మీ కోసమే. ప్రయివేటు రంగంలోని వ్యక్తులు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పెన్షన్ గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఖర్చులు ఎలా అని మదనపడుతారు. ఉద్యోగం ఉన్న సమయంలో నెలనెలా జీతం వస్తుంటే ఖర్చు ఎంతో తెలియదు. కానీ విరమణ తర్వాత ప్రతినెలా జీతం రాదు. అప్పుడు అవసరాలు ఎలా తీరుతాయి. ఇలాంటి ఆందోళనల్లో మునిగిన ప్రజలకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) శుభవార్త చెబుతోంది. NPS ప్రైవేట్ రంగ ప్రజలకు నెలవారీ పెన్షన్ అందిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

ఉద్యోగ విరమణ తర్వాత ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో కావాలనుకుంటే అతను చిన్న వయస్సులోనే NPS వంటి పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఇది డిపాజిట్ మొత్తానికి మెచ్యూర్ కావడానికి ఎక్కువ సమయం ఇస్తుంది. అప్పుడు రిటైర్మెంట్ ఫండ్ డబ్బు పెద్ద మొత్తంలో చేతిలో ఉంటుంది. మీరు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెడితే ఉద్యోగ విరమణ తర్వాత మీకు భారీ మొత్తం లభించే అవకాశం ఉంది. ఒక వ్యక్తి 21 సంవత్సరాల వయస్సులో ప్రతి నెలా 10,000 రూపాయలను ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అతను ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ రూ.1.15 లక్షల పెన్షన్‌ను పొందడం ప్రారంభించవచ్చు.

ఒక వ్యక్తి 21 సంవత్సరాల వయస్సులో ఉద్యోగంలో చేరి, NPSలో ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడనుకుందాం. NPSలో మీరు 60 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టాలి అంటే, ఈ సందర్భంలో అది 39 సంవత్సరాలు ఉంటుంది. దీనిని ఈ క్రింది విధంగా లెక్కించవచ్చు.

1. NPSలో నెలవారీ పెట్టుబడి: రూ. 10,000 (సంవత్సరానికి రూ. 1,20,000)
2. 39 సంవత్సరాలలో మొత్తం సహకారం: రూ. 46.80 లక్షలు
3. పెట్టుబడిపై అంచనా రాబడి: 10%
4. మెచ్యూరిటీపై మొత్తం నిధులు: రూ. 5.76 కోట్లు
5. యాన్యుటీ కొనుగోలు: 40 శాతం
6. అంచనా వేసిన యాన్యుటీ రేటు: 6%
7. 60 ఏళ్ల వయసులో పెన్షన్: నెలకు రూ.1.15 లక్షలు
8. ఈ గణన సుమారుగా ఇవ్వబడింది. అసలు మొత్తం దీనికి భిన్నంగా ఉండవచ్చు.

Salman Khan: త్వరలో దేశవ్యాప్తంగా ‘సల్మాన్ టాకీస్’.. స్పష్టం చేసిన కండల వీరుడు..

EPFO గుడ్‌ న్యూస్‌..18.34 కోట్ల ఖాతాదారులకు 8.50 శాతం వడ్డీ చొప్పున వడ్డీ జమ.. ఇలా చెక్ చేసుకోండి..

Weight Loss: 60 ఏళ్లు దాటినవారు బరువు తగ్గాలంటే ఈ వ్యాయామాలు చక్కటి పరిష్కారం..