Medicine: నకిలీ మందులను ఇలా సింపుల్​గా గుర్తించండి.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

|

Jan 20, 2022 | 3:37 PM

నకిలీ మందులను అరికట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఔషధాల తయారీలో వినియోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)పై క్యూఆర్ కోడ్‌లను పెట్టడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది...

Medicine: నకిలీ మందులను ఇలా సింపుల్​గా గుర్తించండి.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..
medicine
Follow us on

నకిలీ మందులను అరికట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఔషధాల తయారీలో వినియోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)పై క్యూఆర్ కోడ్‌లను పెట్టడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో కొన్ని సెకన్లలో అసలు, నకిలీ మందులను గుర్తించవచ్చు. మొబైల్​తో ఏదైనా ఔషధంపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కస్టమర్లు ఔషధం నకిలీదా కాదా తెసులుసుకోవచ్చు. అయితే ఈ కొత్త నియమం వచ్చే ఏడాది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.

ఈ కొత్త నిబంధనకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీఐలో క్యూఆర్‌ కోడ్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అసలు, నకిలీ మందులను గుర్తించడం ఇప్పుడు సులభతరం కానుంది. QR కోడ్‌లో ఔషధానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. బెంచ్ నంబర్, ధర గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. మొబైల్ నుంచి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఔషధానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది.

డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) జూన్ 2019లో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. QR అంటే క్విక్ రెస్పాన్స్. ఈ కోడ్ వేగంగా చదవగలిగేలా రూపొందించారు. ఇది బార్‌కోడ్ అప్‌గ్రేడ్ వెర్షన్. ఒక నివేదిక ప్రకారం దేశంలోని 3 శాతం మందులు నాణ్యత లేనివిగా ఉన్నాయి. QR కోడ్‌ను కాపీ చేయడం అసాధ్యం, ఎందుకంటే ఇది ప్రతి బ్యాచ్ నంబర్‌తో మారుతుంది. దీంతో నకిలీ మందుల నుంచి దేశానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.

Read Aslo.. Budget 2022: బడ్జెట్‌పై బండెడు ఆశలతో సామాన్య ప్రజలు.. బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారంటే..!