AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 Notes: రూ. 2 వేల నోట్ల మార్పు మరింత సులువు.. ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండానే

దీంతో ఇప్పటికే రూ. 2 వేల నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఆర్‌బీఐ ప్రాంతీయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే ఆర్బీఐ కేంద్రాలకు దూరంగా ఉండే వారికి కూడా నోట్లు మార్చుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దూరంగా ఉండే ప్రజల కోసం నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానాన్ని అమలుచేస్తోంది. పోస్ట్‌ ద్వారా రూ. 2 వేల నోట్లను...

2000 Notes: రూ. 2 వేల నోట్ల మార్పు మరింత సులువు.. ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండానే
Rs 2000 Notes
Narender Vaitla
|

Updated on: Nov 03, 2023 | 7:38 AM

Share

రూ. 2వేల నోట్లను మార్కెట్లో చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 మే 19వ తేదీన ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మొదట బ్యాంకులో మార్చుకోవడం లేదా వ్యక్తుల ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొదట ఈ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు కల్పించిన ఆర్‌బీఐ ఆ తర్వాత సెప్టెంబర్‌ 7 వరకు గడువును పొడగించింది. ఇక ప్రస్తుతం కేవలం ఆర్బీఐ కేంద్రాల వద్దే రూ. 2 వేల నోట్ల మార్పిడి చేస్తోంది.

దీంతో ఇప్పటికే రూ. 2 వేల నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఆర్‌బీఐ ప్రాంతీయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే ఆర్బీఐ కేంద్రాలకు దూరంగా ఉండే వారికి కూడా నోట్లు మార్చుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దూరంగా ఉండే ప్రజల కోసం నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానాన్ని అమలుచేస్తోంది. పోస్ట్‌ ద్వారా రూ. 2 వేల నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. నిజానికి ఈ విధానాన్ని ఇంతకుముందే తీసుకొచ్చిన ఆర్‌బీఐ తాజాగా దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతోంది.

వినియోగదారులు ఇంటిలో నుంచి అడుగు బయటపెట్టకుండానే రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ఇన్సూర్డ్ పోస్ట్‌ లేదా టీఎల్‌ఆర్‌ కవర్‌ను ఉపయోగించుకొని సురక్షితమైన మార్గంలో రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే విషయమై ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్‌ రోహిత్ పి.దాస్‌ మాట్లాడుతూ.. వినియోగదారులు అత్యంత సురక్షితంగా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు వీలుగా ఈ ఇన్సూర్డ్ పోస్ట్‌ను వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రాంతీయ ఆర్‌బీఐ కేంద్రాలకు వెళ్లడం, వరుసలో నిలబడడం వంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందొచ్చు.’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ విధానంలో పంపించిన నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది.

ఇదిలా ఉంటే మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐన తెలిపింది. అక్టోబర్‌ 30వ తేదీ నాటికి ప్రజల వద్ద రూ. 10,000 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ మిగిలిన మొత్తాన్ని కూడా తిరిగి తెప్పించుకునేందుకే ఆర్‌బీఐ ఈ పోస్ట్ సేవలను తీసుకొచ్చింది. దీంతో రూ. 2 వేల నోట్లు మరిన్ని వెనక్కి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..