Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్ రేట్ ఎంతుందో తెలుసా.?
రెండు రోజుల్లో భారీగా బంగారం ధర తగ్గింది. అయితే శుక్రవారం బంగారం ధర మళ్లీ పెరగడం గమనార్హం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640కి చేరింది. మరి దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటి ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలకు గడిచిన రెండు రోజులుగా బ్రేక్ పడినట్లు కనిపించింది. రెండు రోజుల్లో భారీగా బంగారం ధర తగ్గింది. అయితే శుక్రవారం బంగారం ధర మళ్లీ పెరగడం గమనార్హం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640కి చేరింది. మరి దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో శుక్రవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,790గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
* పుణెలో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,640వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,640గా ఉంది.
* వరంగల్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,640గా ఉంది.
* ఇక విజయవాడతో పాటు, విశాఖటపట్నంలోనూ శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,400 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి కూడా బంగారం ధరలోనే పయణిస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. శుక్రవారం కిలో వెండిపై రూ. 700 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 74,800కి చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,700గా ఉంది. ఇ ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాతో కిలో వెండి ధర రూ. 74,800 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ. 73,000గా ఉంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 77,700వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




