LPG Gas Cylinder: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర అమాంతంగా పెరిగిపోతోంది. ప్రతి నెల ధర పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. ధరల పెరుగుదల కారణంగా ప్రతి కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేవలం సిలిండర్ ధర మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ధరలు కూడా పెరిగిపోతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. కానీ రూ.634కే సిలిండర్ పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. ఇది 14.2 కిలోల సిలిండర్ మాత్రం కాదు. సాధారణంగా 14.2 కేజీల సిలిండర్ ధర మార్కెట్‌లో రూ.950 వరకు ఉంది. ఈ సిలిండర్ కాకుండా కంపొసైజ్ ఎల్‌పీజీ సిలిండర్ అయితే తక్కువ ధరకే లభిస్తుంది. దీనిని రూ.634కే పొందవచ్చు. ఇది 10 కిలోల సిలిండర్. అంటే సాధారణ సిలిండర్‌తో పోలిస్తే ఇందులో 4 కిలోల గ్యాస్ తక్కువగా ఉంటుంది. కంపొసైట్ ఎల్‌పీజీ సిలిండర్ తీసుకోవడం వల్ల సిలిండర్ లోపల ఎంత గ్యాస్ ఉందో చూడవచ్చు. మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది సాధారణ సిలిండర్ కన్నా 7 కేజీల బరువు తక్కువగా ఉంటుంది. సులభంగా తీసుకెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్ సిలిండర్లు తుప్పు పట్టవు.
ఈ కంపొసైజ్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఇందులో 5 కిలోల గ్యాస్ సిలిండర్, 10 కిలోల గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉన్నాయి. ఈ 10 కిలోల సిలిండర్ రూ.634 ఉండగా, ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.502 ఉంది. ఇప్పుడు ఈ సిలిండర్లు దేశ వ్యాప్తంగా ఢిల్లీ, బనారస్, ప్రయాగ్‌రాజ్, ఫరీదాబాద్, గురుగ్రామ్, జైపూర్, హైదరాబాద్, జలంధర్, పాట్నా, మైసూర్, లుధియానా, రాయపూర్, రాంచీ, అహ్మదాబాద్ సహా 28 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.