AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension Rules: ఇప్పుడు ఒకే వ్యక్తి రెండు పెన్షన్ల ప్రయోజనం పొందవచ్చు..కొత్తగా మారిన నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

ఇప్పుడు కుటుంబంలోని ఎవరైనా ఒక వ్యక్తి రెండు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కేంద్ర ఉద్యోగులు అయితే, ఇది సాధ్యమే.

Pension Rules: ఇప్పుడు ఒకే వ్యక్తి రెండు పెన్షన్ల ప్రయోజనం పొందవచ్చు..కొత్తగా మారిన నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
Pension Rules
KVD Varma
|

Updated on: Aug 18, 2021 | 8:27 PM

Share

Pension Rules: ఇప్పుడు కుటుంబంలోని ఎవరైనా ఒక వ్యక్తి రెండు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కేంద్ర ఉద్యోగులు అయితే, ఇది సాధ్యమే. ఒక బిడ్డ తల్లి, తండ్రి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, రెండు పెన్షన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని పూర్తి వివరాలను పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ రెండు పెన్షన్ నియమాలలో కొన్ని షరతులు విధించారు. ఆ షరతులకు లోబడి రెండు పెన్షన్ల ప్రయోజనాన్ని తీసుకోవచ్చు.

పెన్షన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం..భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయిఉండి.. వారిలో ఒకరు సర్వీసు సమయంలో లేదా రిటైర్‌మెంట్ తర్వాత మరణిస్తే, అప్పుడు జీవించి ఉన్న ఇద్దరిలో ఎవరికైనా కుటుంబ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. భర్త చనిపోతే, భార్య కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతుంది. భార్య మరణం తరువాత, భర్త కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇద్దరూ చనిపోతే, బతికున్న బిడ్డకు తల్లి అదేవిధంగా తండ్రి ఇద్దరి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. పెన్షన్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ‘పెన్షన్‌కు సంబంధించిన 75 ప్రధాన నియమాలు’ అనే సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్ ద్వారా పాత పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

పెన్షన్ శాఖ ఏం చెప్పింది?

తల్లిదండ్రులు మరణించిన సందర్భంలో.. వారి కుమార్తె విడాకులు తీసుకున్నా లేదా భర్త మరణించి వితంతువుగా ఉన్నా పెన్షన్ ప్రయోజనాన్ని పొందగలుగుతారా? అనే సందేహం చాలామందిలో ఉంది. దీనికి  పెన్షన్ డిపార్ట్‌మెంట్ ఇలా చెబుతోంది. తల్లిదండ్రులు జీవించి ఉండగా భర్త నుండి విడాకులు జరిగినా లేదా భర్త మరణించినా మాత్రమే కుటుంబ పెన్షన్ ప్రయోజనం వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు లభిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడిన కుమార్తె విడాకులు తీసుకుంటే, విడాకుల కేసు  కోర్టులో నడుస్తుంటే మాత్రమే కుటుంబ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. ఈ కేసు ఉద్యోగి లేదా పెన్షనర్ జీవించి ఉండగా ప్రారంభం కావాలి. అతను మరణించిన తరువాత విడాకులు అందుకుంటే కూడా ఈ  నియమం వర్తిస్తుంది. ఈ పరిస్థితిలో, విడాకుల రోజు నుండి కుటుంబ పెన్షన్ లింక్ అవుతుంది.

కూతురికి సంబంధించి నియమాలు ఏమిటి

ఒక పెళ్లికాని కుమార్తె కుటుంబ పెన్షన్ కోసం క్లెయిమ్ చేయగలదా అనేది ఒక ప్రశ్న,  అలా అయితే, దాని వ్యవధి ఎంత. దీనికి ప్రతిస్పందనగా, పెన్షన్ డిపార్ట్‌మెంట్, ఈ పరిస్థితిలో, కుటుంబ పెన్షన్ క్లెయిమ్ చేయడానికి ఎలాంటి కాలపరిమితి నిర్ణయించలేదు. పెళ్లికాని కుమార్తె వివాహం చేసుకునే వరకు కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కూతురు వితంతువు లేదా విడాకులు తీసుకుంటే, పునర్వివాహం వరకు కుటుంబ పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. కుమార్తె అవివాహితురాలైతే, ఆమె ఉద్యోగం చేయనంత కాలం కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందే హక్కు ఆమెకు ఉంది.

వికలాంగ పిల్లల కోసం నియమాలు

ఒక నియమం మరింత ముఖ్యమైనది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగులు లేదా పిల్లలు వికలాంగులైన పెన్షనర్ల కోసం, కుటుంబ పెన్షన్ విషయంలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే  దాని గురించి ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఈ పిల్లల శ్రేయస్సు, పెంపకాన్ని దృష్టిలో ఉంచుకుని, కుటుంబ పెన్షన్ మొత్తాన్ని పెంచవచ్చు. దీని కోసం ప్రభుత్వం నిబంధనలలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత, అతని వికలాంగుల పిల్లలకు CCS (పెన్షన్) రూల్స్, 1972 కింద కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని అందించాలి, దీని కోసం, నియమాలను మార్చాలని ఆదేశించారు. దీని కోసం, ఆర్థిక పారామితులలో మార్పులు చేయవచ్చు.

Also Read: RBI Rules: ఆర్‌బిఐ కొత్త నిబంధనలు! బ్యాంక్ డిపాజిట్ లాకర్ నిబంధనల్లో మార్పులు..ఇకపై లాకర్ల విషయంలో బ్యాంకులు ఇలా చేస్తాయి!

Business Idea: తక్కువ పెట్టుబడితో గౌరవమైన ఉపాధి..అత్యధిక ఆదాయం కావాలా? అయితే, ఇది మీకోసమే!