NCD vs Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కంటే ఎన్‌సీడీల్లో వడ్డీ ఎక్కువ వస్తుందా.. ఎన్‌సీడీల్లో పెట్టుబడి సురక్షితమేనా..

|

Feb 08, 2022 | 8:07 AM

చాలా మంది డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(Fixed Deposit) చేస్తుంటారు. ఎందుకంటే ఇది భద్రతతో పథకం కాబట్టి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే వడీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి...

NCD vs Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కంటే ఎన్‌సీడీల్లో వడ్డీ ఎక్కువ వస్తుందా.. ఎన్‌సీడీల్లో పెట్టుబడి సురక్షితమేనా..
Money
Follow us on

చాలా మంది డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(Fixed Deposit) చేస్తుంటారు. ఎందుకంటే ఇది భద్రతతో పథకం కాబట్టి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే వడీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి. దీంతో పోస్టాఫీస్ స్కీమ్స్(Post Office), పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. రిస్క్ తీసుకోవాలని అనుకునే వారు ఈక్విటీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCD) పెట్టుబడి పెడుతున్నారు. ఇవి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఎస్‌సీడీలు సెకండరీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. ఇవి 9-11 శాతం రాబడిని అందిస్తున్నాయి. ఎన్‌సీడీలను కంపెనీలు జారీ చేస్తాయి. కానీ చాలా రిస్క్‌తో కూడుకున్న పథకంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

టాటా క్యాపిటల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్ క్రెడిట్ సొల్యూషన్, ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల ఎస్‌సీడీలు సెకండరీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. ప్రస్తుతం టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వార్షికంగా 9.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇవి 2028 సెప్టెంబర్‌లో మెచ్యూరిటీకి వస్తాయి. దీని ధర రూ.1,045. వీటిల్లో ఇన్వెస్ట్ ద్వారా 9.03 శాతం రాబడి పొందొచ్చు. జేఎం ఫైనాన్షియల్ క్రెడిట్ సొల్యూషన్ ఎన్‌సీడీ 9.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఎన్‌సీడీ 2028 మే నెలలో మెచ్యూరిటీకి వస్తుంది. ఇది రూ.1,000 వద్ద ట్రేడ్ అవుతోంది. వీటిల్లో ఇన్వెస్ట్ ద్వారా 11.08 శాతం రాబడి పొందొచ్చు.

ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ ఎస్‌సీడీలు వార్షికంగా 10.2 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఇవి 2024 ఫిబ్రవరిలో మెచ్యూరిటీకి వస్తాయి. రూ.996 వద్ద ఇవి ట్రేడవుతున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10.6 శాతం రాబడి పొందొచ్చు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందించే వడ్డీతో పోలిస్తే ఎన్‌సీడీల్లో 2-3 శాతం అధిక వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పదవీ విరమణ చేసిన వారు టీడీసీ కోత ఉండదు. వీటిని డీమ్యాట్ రూపంలో ఉంచుకోవచ్చు. అదే బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ రూ.10,000 దాటితే (ఆర్థిక సంవత్సరంలో) టీడీఎస్ కోత ఉంటుంది.

Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీరు ఈక్విటీ, ఎన్‌సీడీల్లో పెట్టుబడి పెట్టాలంటే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. మీరు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.

Read Also.. RBI Policy Review: ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..