Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి ఊరటనిచ్చే వార్త.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర, తులం ఎంత ఉందంటే..

|

Jan 18, 2023 | 6:13 AM

గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప, తగ్గడం లేదన్నట్లూ దూసుకుపోయిన బంగారం ధరలకు బుధవారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. ప్రతీ రోజూ పెరుగుతూ వస్తున్న గోల్డ్‌ రేట్స్‌కి ఈ రోజు కాస్త పడింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 58 వేలకు చేరువుతోంది...

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి ఊరటనిచ్చే వార్త.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర, తులం ఎంత ఉందంటే..
Gold Price Today
Follow us on

గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప, తగ్గడం లేదన్నట్లూ దూసుకుపోయిన బంగారం ధరలకు బుధవారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. ప్రతీ రోజూ పెరుగుతూ వస్తున్న గోల్డ్‌ రేట్స్‌కి ఈ రోజు కాస్త పడింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 58 వేలకు చేరువుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి బుధవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 52,35గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 52,200గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,950గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,050 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,870గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,250 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 57,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 52,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 52,200 24 క్యారెట్స్‌ ధర రూ. 56,950గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంటే వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కేజీ వెండిపై రూ. 400 వరకు తగ్గింది. మరి బుధవారం దేశంలోని పలు ప్రధాన నగారాల్లో కిలో వెండి ధర ఎంతుందో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,500గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,500 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,300గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 75,300 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..